HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know How Healthy Anjeer Are When They Are Soaked

Anjeer: అంజీర్ ను నానబెట్టుకుని తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా?

అంజీర్ పండును చూసే ఉంటారు. దీన్నే మేడి పండు అని, ఫిగ్ అని అంటుంటారు. వీటివల్ల ఆరోగ్యానికి (Health) ఎంతో మేలు జరుగుతుంది.

  • Author : Maheswara Rao Nadella Date : 11-02-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anjeer
Anjeer

అంజీర్ (Anjeer) పండును చూసే ఉంటారు. దీన్నే మేడి పండు అని, ఫిగ్ (Fig) అని అంటుంటారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజు రాత్రి 3-4 అంజీరాలను (Anjeer) నీటిలో వేయాలి. ఉదయం పరగడుపునే నానవేసిన అంజీరాలను తినాలి. ఆ నీటిని తాగేయడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

బరువు తగ్గడానికి:

అంజీరా బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ. అందుకనే ఉదయాన్నే తినడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి తెలియదు. జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. కడుపు నిండుగా ఉండడం వల్ల ఏది పడితే అది తినేయకుండా నియంత్రించుకోవచ్చు.

పేగుల్లో చురుకుదనం:

మేడి పండులో సొల్యూబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మలబద్ధకం సమస్య రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారు తమ ఆహారంలో భాగంగా అంజీరాని రోజూ తప్పకుండా తినాలి.

మధుమేహానికీ మంచిదే:

మధుమేహం ఉన్న వారు కూడా నీటిలో అంజీరాను నానవేసి తినొచ్చు. వీటిల్లో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ నియంత్రిత స్థాయిలో ఉంచడంలో వీటి పాత్ర ఎక్కువ.

గుండె ఆరోగ్యానికీ:

అంజీరాని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త నాళాలు మూసుకుపోయి గుండె పోటు వస్తుందని తెలిసిందే. అంజీరాని రోజూ తినేవారికి ఈ సమస్య దాదాపుగా ఉండదు.

ఎముకలు గట్టిదనానికి:

మహిళలు, వృద్ధులు, చిన్నారులకు క్యాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది. అంజీరాని రోజూ తినేవారికి క్యాల్షియం తగినంత అందుతుంది. పొటాషియం, క్యాల్షియం కూడా ఆరోగ్యానికి మంచివే.

గర్భిణులు:

అంజీరాలో విటమిన్ బీ6, ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే డల్ గా ఉండేందుకు వీటి లోపమే కారణం. గర్భిణులు అంజీరాని తినడంవల్ల ముందస్తు గర్భస్రావాలు తగ్గుతాయి.

కేన్సర్ రిస్క్:

అంజీరాతో కేన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు. బ్రెస్ట్, కొలన్ కేన్సర్ రిస్క్ ప్రధానంగా తగ్గుతుంది. ఫిగ్స్ లో విటమిన్ సీ తగినంత ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

Also Read:  10 Tips to Stop Joint Pain: కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే 10 చిట్కాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anjeer
  • benefits
  • Eating
  • Fig
  • food
  • health
  • Life Style

Related News

Papaya

ప‌చ్చి బొప్పాయి తింటున్నారా? అయితే ఆ స‌మ‌స్య తీరిన‌ట్లే!

పచ్చి బొప్పాయిని సలాడ్లు, సూప్‌లు, చట్నీల తయారీలో ఉపయోగించవచ్చు. దీనిని పాన్‌లో వేసి తేలికగా వేయించి కూడా తినవచ్చు.

  • Cancers

    భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

  • Hair Loss

    మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

  • High Blood Pressure,

    ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ పెరిగినట్లే!

Latest News

  • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

  • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

  • Khammam : వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు

  • Jayasurya : శ్రీలంక కోచ్ పదవికి జయసూర్య రాజీనామా

  • America Attack on Iran : నాడు కత్తుల పోరు.. నేడు క్షిపణుల హోరు

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd