Cool Drinks: మీకు కూడా కూల్ డ్రింక్స్ అంటే ఇష్టమా.. ఇది తెలిస్తే జీవితంలో మళ్లీ వాటి జోలికి వెళ్ళరు!
Cool Drinks: ఇది తెలుసా.. గ్యాస్ నుంచి ఉపశమనం పొందడం కోసం ఎండ నుంచి రిలీఫ్ పొందడం కోసం కూల్ డ్రింక్స్ తెగకూల్ డ్రింక్స్ తెగ తాగే వారు వాటి జోలికి అస్సలు వెళ్ళరు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Wed - 15 October 25

Cool Drinks: కూల్ డ్రింక్స్.. చిన్నపిల్లల నుంచి పెద్దవాడి వరకు చాలామంది ఇష్టపడి తాగే పానీయం. ముఖ్యంగా వేసవికాలం వచ్చింది అంటే చాలు కూల్ డ్రింక్స్ ని తెగ తాగేస్తూ ఉంటారు. చాలామంది గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యల నుంచి రిలీఫ్ పొందడం కోసం కూల్డ్రింక్స్ చూడావంటివి తాగుతూ ఉంటారు. అయితే కొంతసేపు ఉపశమనాన్ని కలిగించిన శాశ్వతంగా దీర్ఘకాలికంగా తీవ్రంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా కూల్ డ్రింక్స్‌లో చక్కెర, కార్బన్ డయాక్సైడ్ వాయువు, ఆమ్లాలు, రసాయనాలు అధికంగా ఉంటాయి.
ఇవి కడుపు, కాలేయానికి హానికరం అని చెబుతున్నారు. కాగా కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందట. ఇది అసిడిటీ సమస్యను తాత్కాలికంగా తగ్గించడం సంగతి పక్కన పెడితే మరింత పెంచుతుందని చెబుతున్నారు. అలాగే సోడాలోని గ్యాస్ బుడగలు బయటకు వచ్చినప్పుడు కొంత ఉపశమనం లభించినట్లు అనిపించవచ్చు. కానీ ఇది కేవలం భ్రమ మాత్రమే అని చెబుతున్నారు. అధిక చక్కెర శాతం షుగర్ వ్యాధిగ్రస్తులకు సమస్యలను పెంచుతుందట. దీర్ఘకాలంలో ఈ పానీయాలు జీర్ణవ్యవస్థ, కడుపు, కాలేయం, గుండెకు కూడా హానికరం అని చెబుతున్నారు. ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కూల్ డ్రింక్స్ తాగడం చాలా ప్రమాదకరం.
గ్యాస్ట్రిక్ అల్సర్లు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, అలాగే అధిక బరువు లేదా షుగర్ ఉన్నవారు ఈ డ్రింక్స్ పూర్తిగా మానుకోవాలని లేదంటే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే కూల్ డ్రింక్స్ బదులుగా సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. నువ్వుల నీరు, మజ్జిగ, సోంపు లేదా జీలకర్ర నీరు, పుదీనా లేదా తులసి టీ, పాలు వంటివి జీర్ణక్రియకు సహాయపడతాయట. వీటితో పాటుగా ఆహారాన్ని నెమ్మదిగా తినడం, బాగా నమలడం, కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం వంటివి చేయడం వల్ల అసిడిటీని నియంత్రించడంలో సహాయపడతాయట. ఈ సమస్యలను సకాలంలో గుర్తించి, సరైన ఆహారం, జీవనశైలి మార్పులను పాటించడం వల్ల అసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.