HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know Benefits Of Chia Seeds

Chia Seeds : లైంగిక సామర్థ్యాన్ని పెంచే చియా సీడ్స్.. ఎలా వాడాలో తెలుసా?

సంతానలేమికి మరొక కారణం లైంగిక సామర్థ్యం. సరైన ఆహారం(Food) లేక చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికి చియాసీడ్స్(Chia Seeds) మంచి మెడిసిన్(Medicine)లా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.

  • Author : News Desk Date : 28-04-2023 - 9:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know benefits of Chia Seeds
Do you know benefits of Chia Seeds

ఆధునిక జీవితంలో మనిషి అభివృద్ధి వైపు పరిగెడుతూ తనకేం కావాలో మరిచిపోతున్నాడు. ఫలితంగా లేని పోని రోగాలు దరిచేరుతున్నాయి. అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తినడం, ఆల్కహాల్, స్మోకింగ్(Smoking) చేయడం వల్ల చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమికి మరొక కారణం లైంగిక సామర్థ్యం. సరైన ఆహారం(Food) లేక చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికి చియాసీడ్స్(Chia Seeds) మంచి మెడిసిన్(Medicine)లా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. చియా సీడ్స్ కూడా చూడటానికి సబ్జా గింజల లాగే ఉంటాయి. మార్కెట్లో ఇవి దొరుకుతాయి. చియా సీడ్స్ ను ఎలా ఆహారంగా తీసుకోవాలి ? వాటివల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చియా సీడ్స్ లో పోషక, ఔషధ విలువలు బాగా ఉంటాయి. అందుకే ఇప్పుడిప్పుడు వీటి గురించి తెలిసిన వారంతా తమ డైలీ డైట్ లో వీటిని కూడా తింటున్నారు. ముఖ్యంగా చియా సీడ్స్ ను తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. భాగస్వామితో లైంగిక క్రీడలో పాల్గొన్నపుడు వారికి కావాల్సిన సంతోషాన్ని ఇవ్వగలుగుతారు.

చియా సీడ్స్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ సరైన మోతాదులో చియా సీడ్స్ తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పురుషుల్లో లైంగిక కోరికలు పెరుగుతాయి. ఆడవారికి పునరుత్పత్రి ఆరోగ్యాన్నిస్తాయి.

సంతానోత్పత్తిని పెంచడంలో చియాసీడ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో గ్లూటెన్ రహిత ప్రోటీన్లు ఉంటాయి. బాలింతలు కూడా చియా సీడ్స్ ను తినొచ్చు. తద్వారా బిడ్డలకు ఇచ్చే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

వీటిలో కాల్షియం అధికంగా లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. అధిక బరువును కూడా నియంత్రిస్తాయి.

చియా సీడ్స్ ను ప్రతిరోజూ తినడం వల్ల ముఖంపై ముడతలు తొలగిపోతాయి. చర్మం కూడా మృదువుగా ఉంటుంది. చియా సీడ్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను స్థిరీకరించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను దెబ్బతీస్తాయి. రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్‌లలో కణాల పెరుగుదలను పరిమితం చేస్తాయి.

ఒక కప్పు బాదం పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ చియా సీడ్స్ ని వేసి బాగా కలపాలి ఒక రాత్రి మొత్తం లేదా 3 గంటల సేపు నానబెట్టిన తరువాత మన breakfast చేసేటప్పుడు, fruits వేసుకొని తినాలి.

బరువు తగ్గాలనుకునేవారు ఒకస్పూన్ చియా గింజలను గోరువెచ్చటి నీటిలో వేసి బాగా కలిపి కొంచెం నిమ్మ రసం తేనె కలిపి తీసుకోవాలి. చియా విత్తనాలను ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి మొలకలతో లేదా ఫ్రూట్ సలాడ్స్ లలో కూడా పైన చల్లుకొని తీసుకోవచ్చు.

చియా విత్తనాలను రోజు తింటే షుగర్, మలబద్దకం మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపకరిస్తుంది.

మన చర్మం అందంగా మెరుస్తూ కనిపించడానికి చియా సీడ్స్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, చియా విత్తనాలను రెండు టేబుల్ స్పూన్ల తీసుకొని పచ్చి పాలను సరిపడ వేసి కలిపి ఒక రాత్రి మొత్తం అలానే ఉండానివ్వాలి. మరుసటి రోజు మిక్సీ లో వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి. అందులో ఒక స్పూన్ పెరుగు మరియు ఒక విటమిన్ E capsules వేసి కలుపుకోవాలి. ఆ తరువాత ముఖానికి ఈ పేస్ట్ ని రాసుకోవాలి 20 నిమిషాల తరువాత ప్యాక్ తీసేసి వాటర్ తో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం చక్కగా మృదువుగా తయారవుతుంది.

 

Also Read : Biryani : తరచుగా బిర్యానీ తింటున్నారా ? అయితే జర భద్రం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chia Seeds
  • Chia Seeds Benefits
  • health tips
  • healthy food

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd