Orange: నారింజ పండ్ల వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు.. షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్.. ఎలా తీసుకోవాలంటే!
నారింజ పండు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గడంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయని చెబుతున్నారు. మరి ఇంతకీ నారింజ పండును ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే..
- By Anshu Published Date - 02:00 PM, Sat - 24 May 25

నారింజ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే. నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఈ బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు నారింజ పండు తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుందట. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయట.
ముఖ్యంగా ఈ పండు తింటే కేలరీలను తగ్గించినవారవుతారట. ఇందులోని ఫైబర్ కడుపును కూడా నిండుతుందట. దీంతో చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుందట. ఇది బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే హైడ్రేట్ గా కూడా ఉంటుందట. మెటబాలిజం పెరిగి ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయట. అదే విధంగా ఈ పండ్లలో నీటి శాతం కారణంగా హైడ్రేషన్ పెరుగుతుందని చెబుతున్నారు. కాగా నారింజ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందట. దీని వల్ల మెల్లిగా బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరుగుతాయట.
దీంతో కోరికలు తగ్గుతాయని, ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుందని, నారింజ పండ్లలోని విటమిన్ సి కొలెస్ట్రాల్ ని కరిగిస్తుందని చెబుతున్నారు. అదే విధంగా ఫ్యాట్ ని ఎనర్జీగా మార్చడంలో హెల్ప్ చేస్తుందట. ఇంతకీ నారింజ పండ్లు ఎలా తినాలి అన్న విషయంకు వస్తే.. వీటిని నేరుగా లేదంటే, జ్యూస్ ల రూపంలో ఫ్రెష్ గా తీసుకోవచ్చట వీటిని సలాడ్స్, స్మూతీస్, ఇన్‌ఫ్యూజ్ చేసి తీసుకోవచ్చని, ఎలా తిన్నా లాభాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే నారింజపండు మంచిదే అన్నారు కదా అని ఎలా పడితే అలా ఎంతపడితే అంత తింటే మాత్రం సమస్యలు తప్పవు. కాబట్టి నారింజ పండును ప్రతిరోజూ తీసుకున్నప్పటికీ మితంగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.