Dos And Dont’s: టీ తాగుతున్న సమయంలో ఇవి అస్సలు తినకూడదు.. ఎందుకంటే?
ప్రతిరోజు చాలామంది ఉదయాన్నే చాలామంది టీ,కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీ ప్రతిరోజు కచ్చితంగా
- By Anshu Published Date - 08:04 AM, Fri - 26 August 22

ప్రతిరోజు చాలామంది ఉదయాన్నే చాలామంది టీ,కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీ ప్రతిరోజు కచ్చితంగా తాగాల్సిందే అనేవారు కూడా ఉన్నారు. అలాగే ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే చాలామందికి రోజు కూడా గడవదు. చాలామందిలో ఉదయం లేవగానే పరగడుపున కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటివారికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే మైండ్ పని చేయదు. అంతేకాకుండా కొంతమందికి ఉదయాన్నే కాఫీ టీ తాగకపోతే ఆరోజు అంతా కూడా ఏదో విధంగా ఏదో కోల్పోయినట్టుగా కూడా ఉంటారు.
ఇది ఇలా టీ తాగుతున్న క్రమంలోనే కొంతమంది రకరకాల పదార్థాలను తింటూ ఉంటారు. అయితే టీ తాగుతున్నప్పుడు కొన్ని రకాల పదార్థాలను మాత్రం అసలు తీసుకోకూడదట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉల్లిపాయను పచ్చిగా తిని ఆ తర్వాత టీ ని తాగకూడదు. అదేవిధంగా నిమ్మరసం తాగిన తర్వాత కూడా వెంటనే టీ తాగకూడదు. అదేవిధంగా కొందరు శనగపిండితో తయారుచేసిన కొన్ని పదార్థాలను కాఫీ తాగుతూ లేదంటే కాఫీ తాగిన తర్వాత తింటూ ఉంటారు.
అయితే ఈ శనగపిండి పదార్థాలు తిని టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు నష్టం జరగవచ్చు. పసుపును లేదా పసుపుతో తయారు చేసిన వంటకాలను తిన్న వెంటనే టీ ను తాగకూడదు. టీ తాగకు ముందే నీటిని తాగవచ్చు కానీ టీ తాగిన తర్వాత నీళ్లను తాగకూడదు.