HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do Not Drink Water After Eating These Foods

Health Care Tips: ఈ ఫుడ్స్ తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు అస్సలు తాగకండి?

మామూలుగా చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కొంతమంది ఆహారం తింటూ మరోవైపు నీళ్లు తాగుతూ ఉంటారు

  • Author : Anshu Date : 30-01-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 30 Jan 2024 08 29 Pm 8669
Mixcollage 30 Jan 2024 08 29 Pm 8669

మామూలుగా చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కొంతమంది ఆహారం తింటూ మరోవైపు నీళ్లు తాగుతూ ఉంటారు. నిజానికి తినేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగకూడదు. అలా నీళ్లు పదే పదే తాగడం వల్ల ఎక్కువగా ఆహారం తినలేరు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఆహారాలు తినేటప్పుడు కానీ, తిన్న తర్వాత కానీ నీళ్లు అస్సలు తాగకూడదు. మరి ఎలాంటి ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. పాలు తాగే ముందు కానీ, తాగిన తర్వాత కానీ నీటిని అస్సలు తాగకూడదు.

పాలు తాగిన తర్వాత నీళ్లు తాగితే జీవక్రియ దెబ్బ తినే అవకాశం ఉంది. దీని వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూడా ఒక్కోసారి దాహం వేస్తుంది. దీంతో చాలా మంది నీటిని తాగేస్తూంటారు. ఐస్ క్రీమ్ తిన్నాక కూడా అస్సలు నీటిని తాగకూడదు. అలా తాగితే గొంతు నొప్పి వస్తుంది. పుల్లగా ఉండే పండ్లు, ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కొన్ని రకాల సీజనల్ పండ్లు తిన్న తర్వాత వాటర్ తాగకూడదు. దీని వల్ల గొంతు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కాల్చిన పప్పులు తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదు.

దీని వల్ల కడుపులో నొప్పి వస్తుంది. అదే విధంగా వేరు శనగ తిన్న తర్వాత కూడా నీటిని తాగితే దగ్గు వస్తుంది. వేడిగా ఉండే పానీయాలు తాగిన తర్వాత కూడా నీటిని తాగకూడదు. టీ, కాఫీలు, సూప్‌లు వంటివి తాగిన తర్వాత నీళ్లు తాగితే.. జీర్ణ వ్యవస్థపై, పళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. వేడి పానీయాలు తాగిన ఒక 20 నిమిషాల వరకు నీటిని తాగకూడదు. అదేవిధంగా స్వీట్ తిన్న తర్వాత కూడా నీరు అస్సలు తాగకూడదు. ఇలా తాగితే చలువ పళ్ళు పడతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drinking water
  • foods
  • health care tips
  • water

Related News

Stress Leads to Numerous Problems... Here Is What Doctors Have to Say!

Stress: ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

ఒత్తిడి ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను మరింత పెంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడి బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. మీరు విన్నది నిజమే… ఒత్తిడి మీ శరీరం బరువు పెరిగేందుకు కారణం అవుతుందట. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే… మన

    Latest News

    • Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Talliki Vandanam : తల్లికి వందనంపై కీలక అప్డేట్

    • HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

    • IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

    • IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd