Peanuts: ఏంటి.. వేరుశనగలను తింటే ఇన్ని రకాల సమస్యలా.. అయ్య బాబోయ్?
వేరుశెనగలు వీటిని కొన్ని ప్రదేశాలలో శెనగవిత్తనాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సూపర్ ఫుడ్స్ గా పిలవబడే ఈ
- By Anshu Published Date - 07:30 AM, Thu - 3 November 22

వేరుశెనగలు వీటిని కొన్ని ప్రదేశాలలో శెనగవిత్తనాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సూపర్ ఫుడ్స్ గా పిలవబడే ఈ వేరుశనగ విత్తనాలు మన ఆరోగ్యానికి హానికరం. వేరుశనగ విత్తనాలను తింటే ఆరోగ్యానికి హానికరం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే. వేరుశెనగలలో కొవ్వు నూనె అధిక మొత్తంలో ఉండటం వల్ల ఇవి అంత మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి వేరుశనగలను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేరుశెనగలు కేలరీలు అధిక ఉండటం వల్ల తొందరగా బరువు పెరుగుతారు.
బరువు తగ్గాలి అనుకున్న వారు వేరుసెనగలను తినక పోవడమే మంచిది. అలాగే ఎక్కువగా వేరుశనగలను తినడం వల్ల కొంతమందికి అలర్జీలు వస్తూ ఉంటాయి. అంటే ముక్కు కారడం దద్దుర్లు, దురద, వాపు, గొంతు నొప్పిలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామంది టేస్ట్ కోసం ఉప్పు కలిపిన వేరుశనగలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ ఉప్పు కలిపిన వేరుశెనగలు శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతాయి. తద్వారా రక్తపోటు గుండె జబ్బులు లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
దీంతో రక్తపోటు విపరీతంగా పెరగడంతో పాటు గుండె కూడా ప్రమాదంలో పడుతుంది. అలాగే ఎక్కువ మొత్తంలో వీరు వేరుశెనగలను తినడం వల్ల అఫ్లాటాక్సిన్ ల పరిమాణం పెరిగి కాలేయానికి నష్టం కలిగిస్తుంది. అఫ్లాటాక్సిన్ లు అన్నది ఒక హానికరమైన పదార్థం. అయితే వేరుశెనగలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లోపం ఉంటుంది. అంతేకాదు దాని వినియోగం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వేరుశనగలను ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వాటిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. అది గుండెపోటు జీర్ణ సంబంధిత సమస్యలు అధిక రక్తపోటు ధమనులు మూసివేయడం లాంటి సమస్యలకు దారితీస్తుంది.