Diabetes: షుగర్ ఉన్నవారు బెల్లం తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా!
ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ డ
- Author : Anshu
Date : 18-03-2024 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం రావడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు జీవనశైలిని అని చెప్పవచ్చు. 11 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ళు వృద్ధుల వయసు వారి వరకు చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ సమస్య పెరిగిపోవడంతో ప్రతిరోజుల్లో చాలామంది చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు.
మరి మధుమేహం ఉన్నవారు బెల్లాన్ని తినవచ్చా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తినవచ్చని, అయితే స్వచ్ఛమైన రూపంలో దొరికితేనే తినాలట. ప్రస్తుత రోజుల్లో స్వచ్ఛమైన బెల్లం దొరకడం అసాధ్యమని చెప్పవచ్చు. పంచదార కన్నా బెల్లమే ప్రమాదకరంగా మారిందని, బెల్లంతో చేసినవి తినడం మానేయాలని, అవసరమైతే స్వచ్ఛమైన బెల్లంతో ఇంట్లో చేసుకొని తినాలని చెబుతున్నారు వైద్యులు. మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి అని, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా షుగరు సంక్రమిస్తోందట.
విటమిన్లు, మినరల్స్, ఖనిజాల సమతుల్యత ఉన్న ఆహారాన్ని ఎవరూ తీసుకోవడం లేదని, ఇది కూడా షుగరు రావడానికి ఒక ప్రధాన కారణమవుతోందని అంటున్నారు వైద్యులు. ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి మారిపోతోంది. ఇష్టమొచ్చిన సమయానికి నిద్రపోయి ఇష్టమొచ్చిన సమయానికి లేస్తున్నారు. దీనివల్ల వ్యాయామం కూడా చేయడం లేదు. మధుమేహ వ్యాధి రావడానికి ఇది కూడా ఒక కారణమవుతోంది. విస్తృతమైన కాలుష్యం కూడా మధుమేహానికి కారణమవుతోందని, స్వచ్ఛమైన గాలి లేకపోవడం కూడా ఒక కారణమంటున్నారు. శారీరకంగా చురుకుగా ఉండకపోవడం కూడా ప్రజలకు సమస్యగా మారుతోంది. దీనివల్ల కూడా మధుమేహం వస్తోంది. కాబట్టి జీవనశైలి ఆహారము అలవాట్లు మార్చుకోవాలి. అలాగే శారీరక శ్రమ తప్పనిసరి.