Apple-Orange: ఆపిల్,ఆరెంజ్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిది.. దేనివల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయో తెలుసా?
యాపిల్ ఆరెంజ్ పండ్లలో ఈ పండు డయాబెటిస్ పేషంట్లకు మేలు చేస్తుంది. ఈ రెండింటిలో దేనివల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:03 PM, Fri - 7 February 25

ఆపిల్, నారింజ.. ఇవి రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో వేటికవే సాటి అని చెప్పాలి. అయితే ఈ రెండు రకాల పండ్లు మధుమేహం ఉన్నవారికి ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాపిల్స్ లో సాధారణంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర జీర్ణక్రియను నెమ్మదిస్తుందట. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుందని చెబుతున్నారు. యాపిల్ తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకపోవడానికి కారణం అందులో ఉండే పీచు పదార్ధమే. యాపిల్స్ లోని పాలీఫెనాల్స్ ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమయ్యే బీటా కణాలకు నష్టం జరగకుండా చేస్తుందట. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు యాపిల్ పండ్లను ఎక్కువగా తినక పోవడమే మంచిది.
ఒకవేళ తినాలి అనుకున్న కూడా మోతాదులో మాత్రమే తీసుకోవాలని,ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మీడియం సైజు యాపిల్ లో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అటువంటి యాపిల్ ను ప్రోటీన్లు లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే భోజనంతో తినడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చట. ఒక ఆపిల్ పండును కొన్ని డ్రై ఫ్రూట్స్, చీజ్ కలిపి తినాలట. ఒక చిన్న ఆపిల్ లో దాదాపు 4 గ్రాముల ఫైబర్, విటమిన్ సి ఉంటాయట. యాపిల్ పండ్లను ఎప్పుడూ చర్మంతోనే తినాలి. అలా తినడం వల్లనే అందులోని పీచు లభిస్తుందట. యాపిల్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. అలాగే ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు యాపిల్ తీసుకుంటే రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుకోవచ్చట.
ఇకపోతే నారింజ విషయానికి వస్తే.. నారింజ పండ్లు కాస్త పుల్లటి రుచిని కలిగి ఉంటాయి. ఇవి డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పీచుతోపాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఇంతకీ ఈ రెండు పండ్లలో ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. ఈ రెండు పండ్లను అల్పాహారంగా తీసుకోవడం చాలా మంచిది. వీటిని తినడానికి సరైన సమయం పగలు. పొరపాటున కూడా వీటిని ఖాళీ కడుపుతో తినకూడదట.