Abnormal Sweating and Diabetes: చెమట అధికంగా వస్తోందా.. అయితే మీరు ఆ సమస్యతో బాధపడుతున్నట్లే?
సాధారణంగా చెమటలు పట్టడం అన్నది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొంతమందికి ఎక్కువ చెమట కూడా పడుతూ ఉంటుంది.
- Author : Anshu
Date : 06-09-2022 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా చెమటలు పట్టడం అన్నది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొంతమందికి ఎక్కువ చెమట కూడా పడుతూ ఉంటుంది. అయితే ఇలా చెమట ఎక్కువగా రావడం అన్నది కూడా మంచిదే అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. శరీరంలోని చెమట అంతా బయటికి పోవడం వల్ల శరీరం నుంచి మురికిన తొలగించడమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా తయారు అవుతుందని చెబుతుంటారు. అయితే చెమట ఎక్కువగా పట్టడం అన్నది కూడా వివిధ రోగాలకు కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభించినప్పుడు అది మధుమేహానికి కూడా దారితీస్తుంది. శరీరంలోని రక్తంలో స్థాయి అదుపుతప్పి శరీరం నుంచి వివిధ హార్మోన్ విడుదల అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం మన శరీరంలోని స్వేద గ్రంథులను ప్రభావితం చేసి అధిక చెమటకు కారణం అవుతుందట. కొన్ని కొన్ని సార్లు మనకు విపరీతంగా చెమట పట్టినట్లు అనిపించినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అటువంటి పరిస్థితిని వైద్య భాషలో సెకండరీ హైపర్ హైడ్రోసిన్ అని పిలుస్తారు. ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అయితే ఇది అనేక సమస్యలకు వ్యాధులకు కారణం అవుతుంది అని వైద్యులు చెబుతున్నారు.
రక్తంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి కానప్పుడు డయాబెటిక్ హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. శరీరం, మెదడుకు శక్తి ప్రధాన వనరు గ్లూకోజ్. శరీరం తగినంత గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేయకపోతే శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి విపరీతంగా చెమట పట్టడం వల్ల బెడ్ షీట్లు, బట్టలు కూడా తడిసిపోవడంతో పాటు అటువంటి వ్యక్తులకు అలసట, చిరాకు లేదా భ్రమ కలిగించే స్థితుల సమస్యను ఎదుర్కొంటారు. అధిక చెమటను మధుమేహం లక్షణంగా పరిగణించాల్సిన అవసరం లేనప్పటికీ అనేక ఇతర కారణాలు దీనికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం ఎక్కువగా చెమట పట్టడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.