Weight Loss: ఏంటి బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!
బరువు తగ్గడం అన్నది చాలా సులువైన విషయం అని అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 11:33 AM, Fri - 14 February 25

మామూలుగా బరువు పెరగడం అన్నది చాలా ఈజీ. కానీ బరువు తగ్గడం అన్నది మాత్రం అంత సులువైన విషయం కాదని చెప్పాలి. బరువు తగ్గడం కోసం రకరకాల ఎక్సర్సైజులు జిమ్ లో వర్క్ అవుట్ చేయడం వాకింగ్ చేయడం డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు బరువు తగ్గరు. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే బరువు తగ్గడం అన్నది చాలా సులువైన విషయం అంటున్నారు. అందులో ప్రధానమైనది వాటర్.
ఏంటి నీళ్లు తాగితే బరువు తగ్గుతారా అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే నీరు తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందట. చల్లటి నీరు జీవక్రియ రేటును పెంచుతుందట. ఇతర డ్రింక్ లకు బదులు నీరు తాగడం వల్ల కేలరీలు తీసుకోవడం కూడా తగ్గుతుందట. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందట. భోజనానికి ముందు అరలీటర్ నీరు తాగడం వల్ల కేలరీల తీసుకోవడం తగ్గుతుందట. నీరు తాగడం వల్ల తృప్తిగా ఉంటారు. ఫుడ్ తీసుకోవడం తగ్గుతుందట. ఇది బరువు తగ్గడం పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.
శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల క్రమంగా కొవ్వు కరుగుతుందట. నీరు జీర్ణక్రియ, పేగు కదలికను మెరుగుపరుస్తుందట.అలాగే ఆరోగ్యకరమైన పేగు బరువు తగ్గడానికి మద్దతిస్తుందట. కాబట్టి తరచుగా నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇంతకీ నీరు ఎప్పుడు తాగితే బరువు తగ్గుతారు అన్న విషయానికి వస్తే.. భోజనానికి ఒక అర్థగంట ముందు బాగా నీరు తాగడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. దీంతో భోజనం తక్కువగా తింటారు. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చట. మరిన్ని సలహాల కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.