Health Tips : ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కింద గుడ్డు తింటే బ్లడ్ షుగర్ మాయం!!
నేడు ప్రజలు అనుసరిస్తున్న చెడు జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, షుగర్ వ్యాధి ప్రజలను సులభంగా సంక్రమిస్తోంది.
- By Bhoomi Published Date - 10:00 AM, Thu - 4 August 22

నేడు ప్రజలు అనుసరిస్తున్న చెడు జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, షుగర్ వ్యాధి ప్రజలను సులభంగా సంక్రమిస్తోంది. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే.. 30 ఏళ్లు రాకముందే మధుమేహానికి గురవుతున్నారు. కొందరికి మధుమేహంతో వంశపారంపర్య సమస్య ఉంటుంది.
మధుమేహం ఉన్నవారు వారి ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినాలని అంటున్నారు. రక్తంలో చక్కెర శాతం పెరగకుండా మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఇది సహాయపడుతుందని నమ్ముతారు . అలాగే ఇందుకు చక్కటి ఉదాహరణగా రోజూ ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక కొవ్వు ఉన్న ఉడికించిన గుడ్డును రోజూ తినేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయి. రోజులో మధుమేహం లక్షణాలు బాగా నియంత్రించబడతాయి .
మధుమేహం ఉన్నవారు ఉడికించిన గుడ్లను ఎలా తినాలి?
మధుమేహం ఉన్నవారు, లేనివారు ప్రతిరోజూ అల్పాహారంగా ఉడకబెట్టిన గుడ్డుతో పాటు కార్బోహైడ్రేట్‌లు, మంచి కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తొలగిపోతుంది .
Related News

Blood Sugar: ఈ నాలుగు మార్పులు చేయండి…దెబ్బకు బ్లడ్ షుగర్ దిగొస్తుంది…!!
డయాబెటిస్ జీవనశైలి సమస్య. ఈ సమస్య ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల్లో అసమతుల్యం...ఒక్కోసారి బాగా పెరిగిపోవడం, లేదంటే తగ్గిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకని రక్తంలో చక్కెరలను నియంత్రణలో పెట్టుకోవడం చాలా అవసరం.