Curd: పెరుగును ఉప్పుతో లేదా చక్కెరతో దేనితో తింటే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
పెరుగును ఉప్పు లేదంటే చక్కెర ఈ రెండు పదార్థాలలో ఏ పదార్థంతో తీసుకుంటే మంచిదో,దేని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో,ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:02 PM, Sun - 27 April 25

మామూలుగా వేసవికాలం చలికాలం అని సంబంధం లేకుండా ప్రతి సీజన్లో పెరుగు తింటూనే ఉంటాం. అయితే చాలా వరకు పెరుగును ఉప్పుతో తినడం మనం చూసే ఉంటాం. కానీ వేసవికాలంలో మాత్రమే పెరుగులో చక్కెర వేసుకొని లస్సీ చేసుకుని తాగుతూ ఉంటారు. వేసవికాలంలో ఈ లస్సీకి చాలా డిమాండ్ ఎక్కువ. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తాగుతూ ఉంటారు. కొంతమంది లస్సి తాగడానికి అస్సలు ఇష్టపడరు. అయితే పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది పెరుగును ఒక్క ఎండాకాలంలోనే తింటుంటారు. ఇది ఒంట్లో వేడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుందని,కానీ పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినవచ్చట.
చలికాలమైనా, వానాకాలమైనా పెరుగును తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొదట పెరుగును ఉప్పుతో కలిపి తింటే ఏమవుతుంది అన్న విషయానికి వస్తే.. డయాబెటీస్ వ్యాధి ఉన్నవారు పెరుగును పొరపాటున కూడా చక్కెరతో తినకూడదట. ఎందుకంటే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందట. అందుకే మధుమేహులకు పెరుగు, ఉప్పు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. కానీ అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కాంబినేషన్ అసలు మంచిది కాదట. నిజానికి ఉప్పులో ఎన్నో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ పెరుగులో ఉప్పును కలిపితే పెరుగులో ఉన్న మంచి బ్యాక్టీరియా నశిస్తుందట.
అలాగే ఎక్కువ ఉప్పు కలిపిన పెరుగును తీసుకుంటే రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ రెండింటి కలయిక అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగులో పంచదారను కలుపుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుందట. ఇది పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాను చంపదట. అలాగే కడుపు చిరాకును కూడా తగ్గిస్తుందట. ఈ కాంబినేషన్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మీరు వేగంగా బరువు తగ్గుతారు. కానీ ఈ కాంబినేషన్ ను డయాబెటీస్ పేషెంట్లు అస్సలు తినకూడదట. కాబట్టి అది ఉప్పు లేదా చక్కెర అయినా రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు, నష్టాలు ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి పెరుగును తినాలని చెబుతున్నారు. పెరుగులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెరను వేసి తినడం వల్ల పెద్దగా ఎలాంటి సమస్యలు రావు. కానీ మీకు డయాబెటీస్ లేదా బీపీ లేదా ఊబకాయం ఉంటే దీనిని తినడం కొన్ని సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు ఉప్పు, పంచదార కలపకుండా పెరుగు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. పెరుగులోకి ఉప్పు లేదా చక్కెర ఇవి కలుపుకోకుండా అలాగే గట్టి పెరుగు తింటే హార్ట్ స్టోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.