Drinking Water In Copper Vessel: రాగి పాత్రలో నీళ్లు.. పది అద్భుతమైన లాభాలు.. అవి ఏమిటంటే?
కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి కూడా మారాయి. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా మారాయి. దీనితో
- By Anshu Published Date - 04:00 PM, Thu - 21 July 22

కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి కూడా మారాయి. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా మారాయి. దీనితో ఎక్కువ శాతంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చి చేరుతున్నాయి. కాగా ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం మంది బాధపడుతున్న వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి. ఈ మధుమేహం వ్యాధితో చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం కోసం ఎటువంటి మందులు ఆయుర్వేద చిట్కాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, ఈ వ్యాధిని అదుపులో ఉంచే చిట్కాలు మాత్రం చాలానే ఉన్నాయి. మరి ఆయుర్వేదం ప్రకారం డయాబెటిస్ కోసం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
అయితే ఇప్పట్లో లేదు కానీ ఒకప్పుడు పూర్వకాలంలో రాగి చెంబుతో నీళ్లు తాగడం చాలామందికి అలవాటు. ప్రస్తుత రోజుల్లో అయితే ఎక్కడో పాతకాల మనుషులు మాత్రమే రాగి చెంబులో నీటిని తాగడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ప్రతిరోజు ఈ రాగి చెంబులో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికీ పల్లెటూర్లలో వాళ్ళు చాలామంది అలా రాగి చెంబుతో నీటిని తాగుతూనే ఉంటారు. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయం లేవగానే తాగితే రోగాలు మటుమాయం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా రాగి చెంబులో ఉన్న నీటిని తాగడం వల్ల క్యాన్సర్ సమస్య తగ్గుతుంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి.
ఇవి క్యాన్సర్‌కు దారితీసే కణాలతో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చేసుకోవచ్చు. అలాగే థైరాయిడ్‌ను మెరుగుపర్చడంలో మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే రాగి పాత్రలో నిల్వ ఉన్న నీరు తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు. అలాగే కడుపులో ఏర్పడిన పుండ్లను నయం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యతో బాధపడే వాళ్ళు రాగిపాత్రలో నీళ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఈ నీరు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియాలు నాశనం కావడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రాగి పాత్రలోని మీరు తాగడం వల్ల అవి శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది. అలాగే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియాను సైతం తరిమేస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రాగి పాత్రల్లో నీళ్లు అడ్డుకుంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.