Sleeping Tips: గర్భవతులు సరిగా నిద్ర పోకపోతే అది బిడ్డ ఎరుగుదలపై ప్రభావం చూపిస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
గర్భవతులకు సరైన నిద్ర అవసరం. ఒకవేళ సరిగా నిద్ర పట్టకపోతే అది బిడ్డ ఎదుగుదలపై నిజంగానే ప్రభావం చూపిస్తుందా ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:31 PM, Wed - 25 December 24

స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా తగినంత ఫుడ్డు తీసుకొని కంటిన్యూ నిద్ర పోవాలని చెబుతూ ఉంటారు. కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీ సమయంలో సరిగా నిద్ర పట్టక నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు నిద్ర పట్టడం కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే నిద్ర సరిగా పోకపోతే అది బిడ్డ పై ప్రభావాన్ని చూపిస్తుంది అంటూ ఉంటారు. మరి ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీ స్త్రీలు కంటి నిండా నిద్ర పోయినప్పుడే బిడ్డ ఆరోగ్యం అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు వైద్యులు.
కాగా ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి ప్రభావితం చేసే అనేక అంశాలు బిడ్డను కూడా ప్రభావితం చేస్తాయి. అలాంటి వాటిలో నిద్ర ఒకటి. మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం అని మనకు తెలుసు. నిద్రలేమి వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి తక్కువ నిద్రపోతే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందా అంటే నిజమే అంటున్నారు వైద్యులు. ప్రెగ్నెన్నీ సమయంలో మహిళల నిద్ర కచ్చితంగా బిడ్డపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. నిద్ర సమస్యలు, ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా నిద్ర లేకపోవడం శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదలకు హాని కలిగిస్తుందట. గర్భదారన సమయంలో మంచి నిద్ర వల్ల హార్మోన్ల సమతుల్యత, రక్త ప్రసరణ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇవన్నీ శిశువు యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైనవి. గర్భధారణ సమయంలో నిద్ర లేకపోవడం వల్ల తల్లిపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. శిశువు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే కారకాల్లో కార్టిసాల్ ఒకటి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ప్రీఎక్లాంప్సియా, గర్భధారణ మధుమేహం వంటి అనేక పరిస్థితులకు దారితీయవచ్చు. నిద్రలేమి వల్ల శిశువుకు సరిగ్గా పోషకాలు, ఆక్సిజన్ కూడా అందకపోవచ్చట. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో తగినంత నిద్ర అవసరం. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల గర్బిణీ స్త్రీలు రక్తపోటు, ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడతారు. ఇవన్నీ సిజేరియన్ ప్రమాదాన్ని పెంచుతాయి. శిశువు నాడీ సంబంధిత అభివృద్ధికి కూడా హాని కలిగే ప్రమాదముందట.