Pomegranate: దానిమ్మ పండు గింజల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దానిమ్మ పండు గింజల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని, దానిమ్మ పండు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:00 AM, Fri - 23 May 25

దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దానిమ్మ పండు గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దానిమ్మ పండు ను ఎలా తీసుకున్నా సరే అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. దానిమ్మలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో, కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేయడంలో సహాయపడతాయని చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక గిన్నె దానిమ్మ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట.
దానిమ్మలో సహజసిద్ధమైన ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లు ఉంటాయి. ఇవి ప్రాసెస్ చేసిన చక్కెరల వల్ల కలిగే క్రాష్ లేకుండా తక్షణ శక్తిని అందిస్తాయని, అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, కణాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందట. అలసట లేదా రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేసి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందట. దానిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, సన్నని గీతలు, చర్మం వదులుగా మారడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొంటాయని చెబుతున్నారు. అధిక నీటి శాతం చర్మాన్ని తేమగా, మృదువుగా, నిండుగా ఉంచుతుందట.
యూవీ కిరణాల వల్ల కలిగే చర్మ నష్టాన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్లు సరిచేసి, పిగ్మెంటేషన్ లేదా టానింగ్ ను తగ్గిస్తాయట. పునికలాజిన్స్, ఆంథోసైనిన్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కణాల స్థాయిలో మంటను తగ్గించడంలో సహాయపడతాయట. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కీళ్లనొప్పులతో సంబంధం ఉన్న దీర్ఘకాలిక మంట తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా దానిమ్మలోని పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడతాయట. ఇది రక్తనాళాలను సరళంగా ఉంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందట. అలాగే అడ్డుపడకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు. కాగా దానిమ్మ తియ్యగా ఉన్నప్పటికీ, దానిమ్మ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుందట. పూర్తిగా తిన్నప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.