Kidney Stones: బీరు తాగితే నిజంగానే కిడ్నీలు రాళ్ళు కరుగుతాయా?
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి అన్న విషయం గురించి నిజానిజాలు తెలిపారు.
- By Anshu Published Date - 06:00 PM, Fri - 30 August 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు చాలా రకాల ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా విపరీతమైన కడుపునొప్పి వినునొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ఇది ఎంతో నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది కూడా ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాలలో పేరుకుపోయిన స్ఫటిక పదార్థం. ఇది మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, ఇతర పదార్ధాలు పెరగడం వల్ల సంభవిస్తుంది.
ఈ పదార్థాలన్నీ రాళ్లుగా మారుతాయి. ఈ రాళ్లను సరైన సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయించుకుంటే దీని నుంచి తొందరగా బయటపడతారు. అయితే ఈ కాలంలో కూడా కిడ్నీ స్టోన్స్ గురించి ఎన్నో అపోహలను నమ్ముతున్నారు. ఈ అపోహలే కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ ను మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తున్నాయి. అటువంటి వాటిలో చాలామంది బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు. మరి ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు పాలు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని చాలా మంది నమ్ముతుంటారు. దీన్ని ఫాలో కూడా అవుతారు. అయితే దీనిలో నిజం లేదంటున్నారు నిపుణులు. పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం ఎన్నో శారీరక పనులకు అవసరం.
కాల్షియం లోపం ఉన్నా కాల్షియం మరీ ఎక్కువగా ఉన్నా మీ కిడ్నీ స్టోన్స్ మరింత పెరుగుతాయి. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి బీర్ సహాయపడుతుందని చాలా మంది చెప్పడం వినే ఉంటారు. కానీ ఈ విషయంలో ఇంత కూడా నిజం లేదు. బీర్ లో నీళ్లు మాత్రమే కాదు ఆల్కహాల్ కూడా ఉంటుంది. ఇది గ్యాస్ట్రైటిస్, కాలేయం దెబ్బతినడానికి కారణమవుతుంది. అంతే తప్ప బీరు తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి అన్న విషయంలో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు, పిత్తాశయ రాళ్లు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అలాగే ఈ రెండూ వేర్వేరు లక్షణాలు కలిగి ఉంటాయి. పిత్తాశయం రాళ్లు ఉదరం ఎగువ కుడి భాగంలో నొప్పిని కలిగిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు నడుములో భరించలేని నొప్పిని కలిగిస్తాయి.
note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.