HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Coffee And Tea Which Drink Offers More Energy And Focus

‎Health Tips: కాఫీ లేదా టీ.. ఖాళీ కడుపుతో ఏది తీసుకుంటే మంచిదో మీకు తెలుసా?

‎Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ ఈ రెండింటిలో ఏది తీసుకుంటే మంచిదో ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 30-11-2025 - 8:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

‎Health Tips: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో పానీయాలు కాఫీ, టీ. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు కాఫీ, టీ లు తాగుతూనే ఉంటారు. కొందరికి అయితే ఇవి అంటే పిచ్చి అని చెప్పాలి. రోజులో లెక్కలేనన్ని సార్లు తాగుతూ ఉంటారు. అయితే కాఫీ టీ తాగడం మంచిదే కానీ ఎక్కువగా తాగడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. కాగా వీటిని తుగుతున్నాం సరే, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న సందేహం చాలామందికి కలిగే ఉంటుంది. అలాగే ఈ రెండిటిలో ఉదయాన్నే ఏది తీసుకోవాలి అన్న డౌట్ కూడా చాలా మందికి వచ్చే ఉంటుంది.
‎
‎మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే తక్షణ శక్తిని ఇస్తే, టీ దీర్ఘకాలిక ప్రశాంతతను అందిస్తుందట. శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో ఈ రెండూ తమదైన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. కాఫీలో టీ కంటే రెట్టింపు కెఫిన్ ఉంటుంది. అంటే కాఫీ తక్షణమే, బలంగా శక్తిని అందిస్తుందట. ముఖ్యంగా అలసిపోయినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని, టీ మాత్రం తేలికపాటి, స్థిరమైన శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. కాఫీ తక్షణ చురుకుదనాన్ని ఇస్తుందట. ఇది కొన్నిసార్లు వణుకు, గుండె దడ, ఆకస్మిక శక్తి క్షీణతకు దారితీయవచ్చని చెబుతున్నారు.
‎
‎టీలో ఉండే Lథియానైన్ అనే అమైనో ఆమ్లం ప్రశాంతమైన ఏకాగ్రత, స్థిరమైన శక్తిని, తక్కువ ఆందోళనను అందిస్తుందట. కాబట్టి తక్షణ ఉత్తేజానికి కాఫీ, ప్రశాంతమైన ఏకాగ్రతకు టీ మంచి ఎంపికలు అని చెబుతున్నారు. కాఫీ త్వరగా శక్తిని ఇచ్చి త్వరగా తగ్గిపోతుందట. కొన్ని గంటల తర్వాత శక్తి క్షీణతకు దారితీయవచ్చని, Lథియానైన్ వల్ల టీలోని కెఫిన్ నెమ్మదిగా విడుదల అవుతుందట. ఇది స్థిరమైన ఏకాగ్రత, దీర్ఘకాలిక మానసిక స్పష్టతను ఇస్తుందట. అందువల్ల, ఎక్కువసేపు చదవాలన్నా లేదా పని చేయాలన్నా టీ మంచిదని చెబుతున్నారు. కాఫీ, టీ రెండూ యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తాయట.
‎
‎కానీ వేర్వేరు మార్గాల్లో కాఫీ జీవక్రియను పెంచుతుందని, శారీరక పనితీరును మెరుగుపరుస్తుందని డోపమైన్ విడుదలను పెంచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. టీ ఒత్తిడిని తగ్గించి,మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, మానసిక ఓర్పును పెంచుతుందట. టీ వల్ల కలిగే ఒత్తిడి తగ్గింపు స్థిరమైన శక్తికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఇది మీ దినచర్య, శరీర తట్టుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందట. తక్షణ శక్తి, బలమైన చురుకుదనం, ఉదయం మేల్కొలపడానికి లేదా మెరుగైన వ్యాయామ పనితీరు కోసం కాఫీని ఎంచుకోవడం మంచిది స్థిరమైన ఏకాగ్రత, ప్రశాంతమైన శక్తి, తక్కువ ఆందోళన, రోజంతా మానసిక స్పష్టత కోసం టీని ఎంచుకోవాలట. కాఫీ తీవ్రంగా శక్తిని ఇస్తే, టీ స్థిరమైన శక్తిని అందిస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coffe
  • health benefits
  • health tips
  • tea

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

Latest News

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

  • Lockdown : పాకిస్థాన్లో లాక్డౌన్..!

  • Renu Desai : సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలను ఖండించిన రేణుదేశాయ్

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd