HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Causes And Home Remedies For Drooling While Sleeping At Night

Health Tips: నిద్రపోయేటప్పుడు నోట్లో నుంచి లాలాజలం ఎందుకు కారుతుందో తెలుసా?

నిద్రపోయినప్పుడు నోట్లో నుంచి లాలాజలం ఎందుకు వస్తుంది దానిని ఎలా తగ్గించుకోవాలి అన్న విషయాల గురించి తెలిపారు.

  • Author : Anshu Date : 08-09-2024 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

చాలామందికి పడుకున్నప్పుడు నోట్లో నుంచి ఇలా అలా చేయడం బయటికి రావడం అన్నది సహజం. దీనినే కొన్ని ప్రాంతాలలో జొల్లు అని కూడా అంటూ ఉంటారు. ఈ సమస్య కేవలం చిన్న పిల్లల్లో మాత్రమే కాకుండా పెద్దవాళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కొందరికి పెద్ద అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం అలాగే ఉంటుంది. చాలామంది ఇలా వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ ఇది రకమైన ఆరోగ్య సమస్య అని చెబుతున్నారు. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అన్న విషయానికి వస్తే.. నిద్రపోతున్నప్పుడు నోట్లోంచి లాలాజలం వస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న పిల్లలకు దంతాలు లేకపోవడం, లేదా వస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది.

కాబట్టి ఇది వారికి సర్వసాధారణం. కానీ పెద్దలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాం. అలాగే పడుకున్న కొద్దిసేపటి తర్వాత కొంతమంది నోట్లోంచి లాలాజలం బయటకు వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇది ఎక్కువగా వస్తే మరికొంతమందికి మాత్రం తక్కువగా వస్తుంది. మీ నోట్లోంచి లాలాజలం కారుతుంటే హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోవాలట. నిజానికి ఈ సమస్య మనకున్న చెడు అలవాట్ల వల్ల కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. లేదా మీకున్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతుందని నిపుణులు అంటున్నారు.

మీకు ఏదైనా అలెర్జీ ఉన్నా కూడా మీరు పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతుందట. దగ్గు, జలుబు, గొంతు సమస్య, శ్వాసకోశ వ్యాధి వంటి ఇతర సమస్యల వల్ల కూడా నోట్లోంచి లాలాజలం కారుతుందట. ఏవైనా జీర్ణసమస్యలు, ఉదర సమస్యలు, అజీర్ణం వంటి సమస్యల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. నిద్రలేమి కూడా లాలాజలం సమస్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా బయట తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందట. మానసిక సమస్యలు కూడా ఇందుకు దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే ఆమ్ల ఆహారాన్ని ఎక్కువగా తింటే కూడా ఈ సమస్య వస్తుందట. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అన్న విషయానికి వస్తే.. మీరు పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతున్నట్టైతే గోరువెచ్చని నీటితో నోటిని పుక్కలించడం మంచిది. అలాగే ప్రతి రోజూ తులసి ఆకులను తినాలి. లేదా వేడి నీటిలో ఉసిరి పొడి వేసి తిన్న తర్వాత ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

note : పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drooling
  • health tips
  • night
  • sleep

Related News

Sleep After Meal

భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?

తిన్న తర్వాత విపరీతంగా నిద్ర రావడం డయాబెటిస్ లక్షణం కావచ్చు. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వల్ల శరీరం అలసిపోయి నిద్ర వస్తుంది.

  • Can people with diabetes eat raw coconut? What happens if you eat it?

    డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరి తినవచ్చా?..తింటే ఏం జరుగుతుంది..?

Latest News

  • ట్రంప్ విధానాలపై చైనా ఘాటు విమర్శలు!

  • మొబైల్ ఫోన్ అతిగా వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బంగ్లా బాట‌లోనే పాకిస్థాన్‌?!

  • స్టూడెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైర‌ల్‌!

  • ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Trending News

    • కేంద్ర బ‌డ్జెట్ త‌ర్వాత‌ బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతాయా?!

    • టీమిండియాకు మ‌రో బ్యాడ్ న్యూస్‌.. స్టార్ ఆట‌గాడు దూరం!

    • టీ20 వరల్డ్‌కప్‌కు తిలక్ రెడీ

    • బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్, శ్రీలంక వేదికగా సమరం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd