Diabetics: డయాబెటిస్ పేషెంట్లు బంగాళదుంపలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Diabetics: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు బంగాళదుంపలు తినవచ్చా తినకూడదా,ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Wed - 1 October 25

Diabetics: మన వంటింట్లో దొరికే కాయగూరలలో బంగాళదుంప కూడా ఒకటి. బంగాళదుంపతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల స్నాక్స్ కూడా చేసుకొని తింటూ ఉంటారు. అయితే బంగాళదుంపలు మంచివే కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మంచివి కావని,కొంతమంది తినకూడదని మరి కొంతమంది తినవచ్చు అని చెబుతూ ఉంటారు. మరి డయాబెటిస్ సమస్య ఉన్నవారు వీటిని తినవచ్చా తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు బంగాళదుంపలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. అయితే వీటిని అప్పుడప్పుడు తినవచ్చు కానీ తరచూ తినడం అంత మంచిది చెబుతున్నారు. ఎక్కువగా తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయట. అయితే బంగాళదుంప అంటే ఇష్టం ఉండే డయాబెటిస్ పేటెంట్స్ ఆలుకి బదులుగా ఆకుకూరలు తీసుకోవచ్చట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుందట. ఇది మధుమేహం రోగులకు ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే బంగాళదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందట. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత గ్లూకోజ్ గా మారుతుందట. కాబట్టి తరచుగా బంగాళాదుంపలు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరగవచ్చట. బంగాళాదుంపలు తిన్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే పెరిగిపోతాయని చెబుతున్నారు. కాగా బంగాళాదుంపలు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందట. మధుమేహం ఉంటే గుండె ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువ అవుతాయట.
కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడేవారు బంగాళదుంపలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. కాగా పేషెంట్లు బంగాళదుపంలకు బదులుగా పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు. బ్రోకలీ, క్యాలిఫ్లవర్లో కార్బ్స్ తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు టొమాటోలు, దోసకాయలను సలాడ్ల రూపంలో హోల్ గ్రైన్స్, బ్రౌన్ రైస్ కూడా బ్యాలెన్స్డ్ డైట్లో భాగం చేసుకోవచ్చని చెబుతున్నారు.