blood pressure: బీపీ కంట్రోల్ లో ఉండాలి అంటే ఈ నాలుగు పండ్లు తినాల్సిందే.. అవేంటంటే?
మన చుట్టూ ఉన్నవారిలో చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసింది. అధిక రక్తపోటు
- By Anshu Published Date - 06:30 AM, Mon - 26 December 22

మన చుట్టూ ఉన్నవారిలో చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసింది. అధిక రక్తపోటు అంటే బీపీ కంట్రోల్ లేకపోవడం. అధిక రక్తపోటు కారణంగా ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల అధికరక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు.. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అధిక రక్తపోటు నియంత్రించడంలో కివి ఫ్రూట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
కివి ఫ్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల బిపి నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా ఈ పండు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ప్రతిరోజు తినకపోయినా వారానికి ఒక్కసారైనా తినాలి అని అంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. అవి బీపీని నియంత్రణలో ఉంచుతాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో అరటిపండు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రక్తపోటు సమస్యతో బాధపడేవారు అరటి పండ్లు తీసుకోవడం ఎంతో మంచిది. వీటిలో పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటివి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బీపీని నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి.
చిలగడదుంపలో బీపీని నియంత్రించే గుణాలుంటాయి. ఇందులో బీటా కెరోటిన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు స్ట్రాబెర్రీలు కూడా బీపీని నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి. ఈ నాలుగు పండ్లను క్రమం తప్పకుండా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు.