Egg: గుడ్లు ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు.. ఏ టైంలో తినాలో తెలుసా?
కోడిగుడ్లను ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది. ఎలా తింటే ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:34 PM, Mon - 30 December 24

కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే.. ఇందులో ఎన్నో రకాల ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి. కోడి గుడ్డును మన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే అన్ని మంచి ప్రయోజనాలు ఉన్న కోడిగుడ్డుని ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. వీటిని మనం తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందట. చెడు కొలెస్ట్రాల్ వల్ల మనకి నష్టం ఉంటుంది. కానీ మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా మనకి మేలు చేస్తుందీ.
కాబట్టి వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందట. కాగా గుడ్లలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీ టిష్యూస్ రిపేర్ అవుతాయి. అందుకే జిమ్ చేసేవారిని ఎక్కువగా గుడ్లని తినమని చెబుతారు. ఇందులో విటమిన్ రిచ్ ఉంటాయి. వీటిని తినడం వల్ల మజిల్స్ ఎంత మంచిదో బ్రెయిన్ హెల్త్ కూడా అంతే మంచిది. కోడి గుడ్లలో కేలరీలు తక్కువగా ఉండి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు నిండుగా ఉంటుంది. వెయిట్ లాస్ డైట్ లో ఉన్నవారు వీటిని హ్యాపీగా తినవచ్చు. దీంతో జంక్ ఫుడ్స్ తినాలన్న కోరికలు కూడా తగ్గుతాయి. దీంతో స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ తినరు. హెల్దీ ఫుడ్ తింటారు. దీంతో బరువు తగ్గుతారట. కాగా కోడి గుడ్లని ఎప్పుడు తినాలనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.
మీరు కోడిగుడ్లని ఉదయం తీసుకుంటే మెబటబాలిజం పెరిగి ఎనర్జీగా ఉంటారట. అలాగే చాలా సేపటి వరకు ఆకలి కాకుండా ఉంటుందట. దీంతో ఎలాంటి క్రేవింగ్స్ లేకుండా ఉంటాయట. లంచ్ వరకూ క్రేవింగ్స్ లేకుండానే ఉండవచ్చని చెబుతున్నారు. హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అనేది బ్రెయిన్ కి మంచి ఫుడ్. గుడ్లలో కొలైన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది. ఇందులో వాటర్ సొల్యూబుల్ కాంపౌడ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కొలైన్ అనేది న్యూరోట్రాన్స్మీటర్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి మెమరీ రెగ్యులెట్ చేసి మూడ్, ఇంటెలిజెన్స్ పెంచుతుంది. దీని వల్ల బ్రెయిన్ ఫంక్షన్ మెరుగ్గా మారుతుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ లో తినడం చాలా మంచిదని చెబుతున్నారు. రాత్రుళ్లు గుడ్లు తింటే మజిల్ రిపేర్ అయి మజిల్స్ పెరుగుతాయి. ఆ టైమ్ లో మజిల్స్‌కి ప్రోటీన్ అవసరం. కోడిగుడ్లలో బాడీకి అవసరమైన అమైనో యాసిడ్ష్ ఉంటాయి. ఇవి బాడీ మజిల్స్‌ని పెంచి బలంగా చేస్తాయట. వీటిని రాత్రుళ్లు తినడం వల్ల మంచి నిద్ర పడుతుందట. ఎందుకంటే ఇందులో అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ ని రిలీజ్ చేస్తుంది. ఇది మెలటోనిన్ గా మారి నిద్ర సమస్యల్ని దూరం చేస్తుంది. దీంతో హ్యాపీగా, ప్రశాంతంగా నిద్రపోతారు.