Thati Bellam: వామ్మో.. తాటి బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా?
తాటి బెల్లం తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరట.
- By Anshu Published Date - 05:03 PM, Sun - 5 January 25

తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. తాటి బెల్లం తరచూ తీసుకోవటం వల్ల కాల్షియం, పొటాషియం పెరిగి ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే నెలసరి, అధిక బరువు సమస్యలకు కూడా తాటి బెల్లం సహాయపడుతుందట. చక్కెరతో పోలిస్తే తాటిబెల్లంలో ఖనిజ లవణాలు 60 శాతం ఎక్కువగా ఉంటాయి. టీ, కాపీ, పండ్ల రసాలలో తాటి బెల్లాన్ని వినియోగించవచ్చట. కాగా తాటి బెల్లం జీర్ణ సమస్యలకు చక్కగా ఉపయోగపడుతుంది. తాటి బెల్లంలోని పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుందట. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందట.
మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. తాటి బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్ లను ఉత్తేజ పరిచి అజీర్తిని దూరం చేస్తుందట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయని చెబుతున్నారు. అలాగే ఇందులోని ఇనుము, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తహీనత సమస్య కూడా ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడతాయని,ఎక్కువ మోతాదులో ఉండే కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందట. తాటి బెల్లంలో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుందని చెబుతున్నారు.
అలాగే అధిక బరువు నెలసరి సమస్యలతో బాధపడే వారు తాటి బెల్లం తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పితో ఇబ్బంది పడుతున్న వారు నోట్లో కొద్దిగా బెల్లం తీసుకొని చప్పరిస్తే ఉపశమనం పొందవచ్చట. తాటి బెల్లంలో శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పొడిదగ్గు, జలుబు వంటి వాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మాన్ని తొలగించి వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఆస్తమా బాధితులకు చక్కటి ఉపశమనం కలిగిస్తుందట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయట. తాటి బెల్లం శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.