HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Watermelon And Musk Melon In Summer

Summer Fruits: వేసవిలో దొరికే పుచ్చకాయ,కర్బూజా.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వేసవికాలంలో దొరికే పుచ్చకాయ కర్బూజా పండ్లలో ఆరోగ్యానికి ఏది మంచిది ఎక్కువ దీని వల్ల లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 26-02-2025 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Summer Fruits
Summer Fruits

ఎండాకాలం వచ్చింది అంటే చాలు మార్కెట్ లో ఎక్కడ చూసిన కూడా కర్బూజా, కళింగర, దోసకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో చాలామంది ఎక్కువగా ఖర్భుజా, పుచ్చకాయలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవి రెండూ కూడా నీటి శాతం ఎక్కువ కలిగిన పండ్లు. వీటిని సమ్మర్ లో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇవి రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేసవిలో కాలంలో వచ్చే చాలా రకాల సమస్యల నుంచి బయటపడాలి అంటే పుచ్చకాయను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇందులో 90% కంటే ఎక్కువ నీటి శాతం కలిగి ఉంటుంది. ఈ పండు హైడ్రేషన్ పవర్‌హౌస్‌ అనడంలో ఆశ్చర్యం లేదు. పుచ్చకాయలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. పుచ్చకాయలో అధిక నీటి శాతంతో పాటు, విటమిన్ ఎ, సిలకు మంచి మూలం అని చెప్పవచ్చు.

అలాగే వేసవికాలంలో విరివిగా లభించే పండ్లలో మస్క్‌మిలన్ కూడా ఒకటి. దీనినే కర్బూజా అని కూడా పిలుస్తారు. ఇది తీపి వాసనతో ఆరెంజ్ రంగుతో అందంగా కనిపిస్తుందట. పుచ్చకాయతో పోలిస్తే కర్బూజాలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ ను అందిస్తుందట. దీనిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని బీటాకెరోటిన్ క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తాయట. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయట. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుందట. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందట.

మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. రెండు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శరీరానికి తేమను రిఫ్రెష్‌ గా అందిస్తాయి. అయితే పుచ్చకాయలో నీటి శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కర్బూజ మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. మొత్తానికి ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో రెండూ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. సమ్మర్లో శీతల పానీయాలకు బదులుగా ఈ పండ్లను జ్యూస్ రూపంలో లేదంటే నేరుగా కూడా తినవచ్చు అని చెబుతున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Muskmelon
  • Summer Fruits
  • summer tips

Related News

Heart Attack Anger

కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

Heart Attack  ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • Health Tips

    నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd