Health Tips: తొందరగా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఉదయం పరగడుపున ఈ నీటిని తాగాల్సిందే!
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఆరోగ్యంగా బరువు తగ్గడం కోసం ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని ఉదయాన్నే తాగితే చాలు అని చెబుతున్నారు. ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:03 AM, Fri - 16 May 25

ఈరోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. అయితే బరువు తగ్గడం కోసం జిమ్ కి వెళ్లడం, వ్యాయామాలు చేయడం, వాకింగ్ చేయడం, డైట్లు ఫాలో అవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమంది అస్సలు బరువు తగ్గదు. అయితే మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఏం చేస్తే ఈజీగా తొందరగా బరువు తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం నిమ్మరసం, తేనే ఇవి రెండు ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. కాగా నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వు, విష పదార్థాలను త్వరగా కరిగించడంలో ఎంతో బాగా సహాయపడతాయట. మరోవైపు తేనె తాగితే శరీరం వెంటనే శక్తివంతం అవుతుందట. ఈ రెండు పదార్థాలు కలిపి తాగడం వల్ల జీవక్రియలు వేగంగా జరిగి శరీరంలోని వాడిన కేలరీలను తగ్గిస్తాయని చెబుతున్నారు. కాగా బరువు తగ్గాలి అనుకున్న వారు ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపి తాగడం ప్రారంభిస్తే వారు త్వరగా ఫలితాలు గమనిస్తారట. ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, శరీరంలో చెడు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
ఉదయం ఈ నీరు తీసుకుంటే శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు వెళ్ళిపోయి, శరీరం శుభ్రం అవుతుందని, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.. బరువు తగ్గడం కోసం వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తీసుకోవాలట. వేడి నీటిలో ఈ రెండు పదార్థాలను కలిపి తాగడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుందట. ఇది శరీరంలో శక్తిని పెంచుతుందని, అలాగే వేడి నీటిలో కలిపి తాగడం వల్ల డీటాక్స్ విధానం మరింత బాగా పనిచేస్తుందని ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే నిమ్మ, తేనె కలిపిన నీటిని ఏ సమయంలో అయినా ఉపయోగించవచ్చట. కానీ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరింత మంచిదని చెబుతున్నారు. ఉదయం తీసుకున్నప్పుడు శరీరంలో డిటెక్స్ విధానం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందట.. లేదంటే మధ్యాహ్నం, రాత్రి కూడా ఈ డ్రింక్ ని తాగవచ్చని, ఇది శరీరానికి శక్తిని ఇస్తుందని, రాత్రిపూట ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నిద్ర పట్టేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. ఈ డ్రింకు తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందడంతో పాటుగా ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు.