Jaggery Water : బెల్లం నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
బెల్లం విడిగా కాకుండా గోరువెచ్చని నీటిలో బెల్లం పొడిని పరకడుపున తినడం వలన అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. లేదా బెల్లం ముక్క ను ముందుగా తిని ఆ తరువాత గోరువెచ్చని నీటిని తాగవచ్చు.
- Author : News Desk
Date : 22-05-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
బెల్లం(Jaggery) ఈ కాలంలో అందరూ చక్కెరకు బదులుగా వాడుతున్నారు. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రాట్స్, సోడియం, విటమిన్ సి ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి. బెల్లం చిన్న పిల్లలు, పెద్దవారు, బీపీ ఉన్నవారు అని తేడా లేకుండా ఎవరైనా తినవచ్చు. అయితే బెల్లం విడిగా కాకుండా గోరువెచ్చని నీటిలో బెల్లం పొడిని పరకడుపున తినడం వలన అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. లేదా బెల్లం ముక్క ను ముందుగా తిని ఆ తరువాత గోరువెచ్చని నీటిని తాగవచ్చు.
* గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకొని తాగడం వలన గ్యాస్ సమస్య ఉంటే తగ్గుతుంది.
* బెల్లం కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
* ఈ విధంగా బెల్లం నీరు ఉదయాన్నే తాగడం వలన మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
* అధికబరువు ఉన్నవారు కూడా రోజూ బెల్లం కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం వలన బరువు తగ్గుతారు.
* మన శరీరంలో బీపీ కంట్రోల్లో ఉంటుంది.
* రోజూ బెల్లం నీరు తాగడం వలన లివర్ లో ఏమైనా విషపదార్థాలు వస్తే వాటిని బయటకు పంపిస్తుంది.
* బెల్లంలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది.
* బెల్లం నీటిని తాగడం వలన రక్తహీనత తగ్గుతుంది.
* బెల్లం నీటిని తాగడం వలన మనం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.
* బెల్లం నీరు మన శరీరంలో ఎలెక్ట్రోలైట్లు బ్యాలన్సుగా ఉండేలా చేస్తుంది.
మనకు శ్రీరామనవమి రోజు కూడా పానకం తాగాలని, ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దలు చెప్తారు. చక్కర బదులు ఆరోగ్యం కోసం బెల్లం వాడటం చాలా మంచిది.
Also Read : Mushrooms: మష్రూమ్స్ తో బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు?