Green Peas : పచ్చి బఠాణీలు తినడం వలన ఉపయోగాలు తెలుసా?
పచ్చి బఠాణీలు(Green Peas) కూరల్లో లేదా పచ్చివి నానబెట్టి కూడా తింటూ ఉంటారు. బిర్యానీ, కొన్ని రైస్ ఐటమ్స్ లో కూడా వేసుకుంటారు.
- By News Desk Published Date - 09:30 PM, Mon - 20 November 23
పచ్చి బఠాణీలు(Green Peas) కూరల్లో లేదా పచ్చివి నానబెట్టి కూడా తింటూ ఉంటారు. బిర్యానీ, కొన్ని రైస్ ఐటమ్స్ లో కూడా వేసుకుంటారు. పచ్చి బఠానీలలో ఫైబర్, ఐరన్,కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ప్రోటీన్, విటమిన్ b6 , మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, జింక్, యాంటి యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. పచ్చి బఠాణీలను ఎవరైనా తినవచ్చు. పచ్చి బఠాణీలలో ఉండే మెగ్నీషియం, విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వలన చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి తొందరగా గురవకుండా ఉంటాము.
పచ్చి బఠాణీలలో ఉండే ఫైబర్ ఉండడం వలన అది తినడం వలన మనకు తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. పచ్చి బఠాణీలలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తినడం వలన తొందరగా బరువు తగ్గుతారు. పచ్చి బఠాణీలలో ఉండే సెలీనియం కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు, కీళ్ళ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. పచ్చి బఠాణీలలో ఉండే కాల్షియం, విటమిన్ కె మనలోని ఎముకలు బలంగా తయారయ్యేలా చేస్తుంది.
పచ్చి బఠాణీలలో ఉండే విటమిన్ ఎ మన కళ్ళ ను కాపాడతాయి. కంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పచ్చి బఠాణీలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది. పచ్చి బఠాణీలను తినడం వలన జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి పచ్చి బఠాణీలు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Also Read : Alcohol : అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా?
Related News
Contraceptive Medicines : గర్భనిరోధక మందులు మహిళల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయా.?
Contraceptive Medicines Effects : అవాంఛిత గర్భధారణను నివారించడానికి డాక్టర్ సలహా లేకుండా మహిళలు తరచుగా గర్భనిరోధక మందులను తీసుకోవడం ప్రారంభిస్తారు, అయితే వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి, వాటిలో ఒకటి రక్తం గడ్డకట్టడం, ఇది శరీరంలోని ఏ భాగానైనా సంభవించవచ్చట.. మరిన్ని విషయాలు తెలుసుకోండి