Garlic: వెల్లుల్లి తింటే నిజంగానే ఆయుష్షు పెరుగుతుందా?
వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 03:31 PM, Mon - 2 September 24
మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వెల్లుల్లిని ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీని వాసన మాత్రమే కాకుండా రుచి కూడా చాలా ఘాటుగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి. వెల్లుల్లి తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడంలో వెల్లుల్లి ఎంతో బాగా పనిచేస్తుంది.
చలికాలంలో కాల్చిన వెల్లుల్లిని కూడా తినవచ్చు. దీన్ని కాల్చడానికి ముందు వెల్లుల్లి తొక్క తీయండి. తర్వాత దానిపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోసి ఉప్పు, నల్ల మిరియాల పొడి కలిపి తక్కువ మంట మీద డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒకటి నుంచి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే సరిపోతుంది. ఇలా తరచుగా తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయట. దీంతో దగ్గు, ఫ్లూ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లు శరీరంలో ఎక్కువ సేపు మనుగడ సాగించలేవని చెబుతున్నారు. వెల్లుల్లి జీర్ణమైన తర్వాత దాని భాగాలు రక్తంలో కరిగిపోవడం ప్రారంభిస్తాయట. దీంట్లో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంటుందట.
వెల్లుల్లి మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే యాంటీ హైపర్లిపిడెమియా ప్రభావాలను కలిగి ఉంటుందట. వారానికి ఒకసారి వెల్లుల్లిని తినే వ్యక్తులు తినని వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారట. వెల్లుల్లి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడమే కాకుండా నయం చేసే శక్తిని కూడా కలిగి ఉంటుందట. కాబట్టి వెల్లుల్లి తింటే మీ ఆయుష్షును కూడా పెంచుకోవచ్చట. ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు అధిక రక్తపోటునే ప్రధాన కారణంగా భావిస్తారు. వెల్లుల్లిలోని సమ్మేళనాలు రక్తపోటు మందుల మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి కేవలం వంటల్లో ఉండే వెల్లుల్లి మాత్రమే కాకుండా పచ్చిగా ఉన్న వెల్లుల్లి తినడానికి కూడా ప్రయత్నించండి. ఇలా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు సలహా తీసుకోవడం మంచిది.
Related News
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తింటే నిజంగానే బరువు పెరుగుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.