Pineappale : పైనాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు..
పైనాపిల్ కోయడం చాలా కష్టం కానీ రుచి పరంగా అందరికీ ఇష్టమే. అయితే దీనిని తినడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- By News Desk Published Date - 11:00 PM, Tue - 27 June 23
అన్ని రకాల పండ్ల కంటే పైనాపిల్(Pineappale)రుచి కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా చాలా బాగుంటుంది. పైనాపిల్ కోయడం చాలా కష్టం కానీ రుచి పరంగా అందరికీ ఇష్టమే. అయితే దీనిని తినడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కప్పు పైనాపిల్ ముక్కలను మనం తింటే మనకు ఒక రోజుకు సరిపడ విటమిన్ సి అందుతుంది. దీని వలన మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మన శరీరంలో కణజాలం వృద్ధి చెందడానికి, కణజాలాలకు ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గడానికి ఉపయోగపడుతుంది.
పైనాపిల్ తినడం వలన మనకు క్యాన్సర్, గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. పైనాపిల్ తినడం వలన అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు. పైనాపిల్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలకు వృద్దాప్య ఛాయలు తొందరగా రాకుండా తోడ్పడుతుంది. పైనాపిల్ తినడం వలన కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పైనాపిల్ లో ఉండే బ్రొమలనిన్ అనే ఎంజైము మన శరీరంలో ప్రోటీన్లు జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. పైనాపిల్ తినడం వలన మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పైనాపిల్ లో ఉండే పీచు పదార్ధం మన కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. పైనాపిల్ లో ఉండే మాంగనీస్, విటమిన్ సి’తో కలిసి మన చర్మాన్ని సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. మన చర్మం మెరిసేలా చేస్తుంది. కాబట్టి మనం పైనాపిల్ తినడం వలన మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందుతాయి. మనకు ఎలాంటి అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి.
Also Read : Rainy Season : వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు చాలావరకు దూరంగా ఉండండి..