Rainy Season : వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు చాలావరకు దూరంగా ఉండండి..
వర్షాకాలంలో మనం తినే ఆహారపదార్థాల(Food) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
- By News Desk Published Date - 10:00 PM, Tue - 27 June 23
వర్షాకాలం(Rainy Season) వచ్చింది అంటేనే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వెంట వెంటనే వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో మనం తినే ఆహారపదార్థాల(Food) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆహార పదార్థాలకు మాత్రం దూరంగా ఉంటే మంచిది.
* పానీ పూరీ అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ వానాకాలంలో నీరు కలుషితం అయ్యి వాంతులు, విరోచనాలు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పానీపూరీ వానాకాలంలో తినకూడదు.
* పచ్చి కూరగాయలను ఈ కాలంలో తినకూడదు తింటే మన శరీరంలో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
* చేపలు, రొయ్యలు వంటివి వానాకాలంలో సంతానోత్పత్తిని కలుగజేస్తాయి కాబట్టి వాటిని ఈ కాలంలో తినకూడదు తింటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
* పుట్టగొడుగులు ఈ వానాకాలంలో తినకూడదు వీటిని తింటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
* ఫ్రై చేసిన ఆహారపదార్థాలను కూడా ఈ కాలంలో తీసుకోకూడదు.
* మామిడిపండ్లను వానాకాలంలో తింటే పిత్త, వాత, కఫ దోషాలు పెరుగుతాయి.
* వానాకాలంలో పండ్లరసాలను ఎక్కువగా తీసుకోకూడదు.
* మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోకూడదు.
* కాచి చల్లార్చిన నీటినే తాగాలి మంచినీళ్లను మామూలుగా తాగకూడదు.
* వేడి వేడి ఆహారాన్ని తినాలి, చల్లారిన ఆహారాన్ని తినకూడదు.
* వర్షాకాలంలో ఎక్కువగా బయట ఆహారం తినకూడదు.
వానాకాలంలో ఆహార పదార్థాలలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
Also Read : Mushroom Omelette: వెరైటీగా మష్రూమ్స్ ఆమ్లెట్.. టేస్ట్ కూడా అద్భుతం?
Related News
Toilet: టాయిలెట్ కమోడ్ బ్యాడ్ స్మెల్ వస్తుందా.. ఈ టిప్స్ ఫాలోకండి
Toilet: చాలామంది టాయిలెట్ కమోడ్ నుంచి దుర్వాసన వస్తున్నా.. పట్టించుకోరు. కానీ టిప్స్ పాటిస్తే దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ బాత్రూమ్ను శుభ్రం చేయండి. వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేయండి. ప్లంబర్ని పిలిచి పైపులను చెక్ చేయించాలి. చెత్తాచెదారం ఇరుక్కుపోయి ఉండవచ్చు, శుభ్రపరచడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది. బాత్రూంలో మంచి వెంటిలేషన్, సూర్యరశ్మిని జాగ్రత్తగా చూసుక�