Jaggery: ప్రతిరోజు చిన్నం బెల్లం ముక్క తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు!
తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, బరువు తగ్గడంతో పాటు ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 27 December 24

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెల్లం ని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా రకాల స్వీట్లు తయారీలో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు ఎక్కువ శాతం చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు జాయింట్ పెయింట్స్ కు ఎంతో బాగా పనిచేస్తుంది. తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా మారతాయి. అలాగే ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాడీలో ఎనర్జీని పెంచుతాయి.
చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలసట తగ్గుతుంది. ఎనర్జీ కూడా అందుతుంది. ఈ బెల్లం ముక్క తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు బెల్లం తినిపించడం వల్ల అందులో ఉండే విటమిన్ సి జింక్ సెలీనియం వారిలో ఇమ్యూనిటీని పెంచి బ్యాక్టీరియా వైరస్ ల కారణంగా వచ్చే సమస్యల నుంచి దూరం చేస్తాయి. బెల్లం తినడం వల్ల ఇది బరువు తగ్గడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గవచ్చు.
అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గితే అనిమియా ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ మన బాడీలో ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఈ లెవెల్స్ తగ్గడం వల్ల త్వరగా అలసిపోవడం, శ్వాస సమస్యలు, గుండె దడ తలనొప్పి నీరసం చేతులు చల్లగా మారడం చర్మం పచ్చగా కనిపించడం లాంటివి జరుగుతుంది. వీటి నుంచి బయటపడాలంటే తరచుగా కొంచెం బెల్లం ముక్కను తీసుకోవడం మంచిది. రోజు భోజనం చేశాక ఒక చిన్న ముక్క బెల్లం తింటే మన బాడీలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్టివ్ అవుతాయని చెబుతున్నారు.