Good Health: ప్రతిరోజు వీటిని రెండు తీసుకుంటే చాలు.. కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు!
Good Health: ఇప్పుడు చెప్పబోయే పండ్లను ప్రతిరోజు రెండు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అలాగే కొన్ని రకాల మార్పులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏవో వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Thu - 23 October 25

Good Health: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏడాది మొత్తం సీజన్ తో సంబంధం లేకుండా లభించే అరటిపండ్ల వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మిగతా పండ్లతో పోల్చుకుంటే వీటి ధర చాలా తక్కువ. అరటిపండ్లలో ఉండే విటమిన్ సి, డైటరీ ఫైబర్, మాంగనీస్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయట. మీ రోజువారీ ఆహారంలో రెండు అరటిపండ్లను చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
అరటిపండ్లలో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఇందులో విటమిన్ సి, డైటరీ ఫైబర్, మాంగనీస్ వంటి అంశాలు ఉంటాయి. మీరు బలహీనంగా లేదా రక్తహీనతతో బాధపడుతుంటే, రోజూ రెండు అరటిపండ్లు తినాలి. అయితే రోజు రెండు అరటి పండ్లు తింటే ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీర్ణవ్యవస్థకు అరటిపండ్లు చాలా ముఖ్యమైనవి. రోజుకు రెండు మీడియం సైజు అరటిపండ్లు మీ రోజువారీ ఫైబర్ అవసరాలలో దాదాపు 18 నుంచి 20శాతం అందిస్తాయట.
ఈ ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శరీరం నుండి కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయపడుతుందట. సగం పండని అరటిపండులో కనిపించే నిరోధక పిండి చిన్న ప్రేగులలో జీర్ణం కాలేదట. నేరుగా పెద్ద ప్రేగులకు వెళుతుందని, ఈ పిండి పదార్థం వల్ల అరటిపండ్లు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉంచడం ద్వారా బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయని, ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాగా అరటిపండ్లు సహజ శక్తికి అద్భుతమైన మూలం అని చెప్పాలి. వాటిలో సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లు ఉంటాయి. ఇవి శరీరానికి అదనపు కొవ్వు లేదా కొలెస్ట్రాల్ లేకుండా తక్షణ శక్తిని అందిస్తాయట. అందుకే అరటిపండ్లు పిల్లలకు,అథ్లెట్లకు, అల్పాహారానికి ముందు, తర్వాత తినడానికి బెస్ట్ టైమ్ అని చెబుతున్నారు.
అరటిపండ్లలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. రెండు మీడియం సైజు అరటిపండ్లు మీ రోజువారీ మాంగనీస్ అవసరాలలో 26 శాతం అందిస్తాయట. ఈ మాంగనీస్ మీ చర్మ ఆరోగ్యానికి అవసరమైన కొల్లాజెన్ ను తయారు చేయడంలో సహాయపడుతుందట. ఇంకా ఇది మీ చర్మం, శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుందట. అరటిపండ్లు పొటాషియం అద్భుతమైన మూలం. రోజుకు రెండు అరటిపండ్లు తినటం వల్ల సుమారు 770 నుంచి 800 mg పొటాషియంను అందిస్తాయట. అలాగే రక్తహీనత లేదా రక్తం తక్కువగా ఉండటం అనేది శరీరంలో ఇనుము లేకపోవడం వల్ల వస్తుంది. అరటిపండ్లు ఈ సమస్యను నివారించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.