Dry Dates : కాళ్ళ, కీళ్ల నొప్పులకు.. ఖర్జూరాలు ఎంత మంచి మెడిసన్ తెలుసా?
బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాలు వంటి డ్రైఫ్రూట్స్ తినడం వలన అన్ని రకాల పోషకాలు అంది మంచి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. ఎండు ఖర్జూరాలల్లో(Dry Dates) మిగిలిన డ్రైఫ్రూట్స్ కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.
- By News Desk Published Date - 10:30 PM, Fri - 19 May 23

ఈ రోజుల్లో కాళ్ళ నొప్పులు(Leg Pains) అనేవి చిన్న పిల్లలు, యువతీయువకులు, పెద్దవారు అని తేడా లేకుండా అందరికీ వస్తున్నాయి. అవి మనం రోజూ చేసే పనుల వలన కావచ్చు లేదా మనం తినే ఆహారం(Food) వలన కూడా కావచ్చు. అయితే బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాలు వంటి డ్రైఫ్రూట్స్ తినడం వలన అన్ని రకాల పోషకాలు అంది మంచి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. ఎండు ఖర్జూరాలల్లో(Dry Dates) మిగిలిన డ్రైఫ్రూట్స్ కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.
ఎండు ఖర్జూరాలు రెండిటిని ముక్కలు చేసి వాటిని పాలల్లో వేసి మరిగించాలి. దానిలో పంచదార కానీ బెల్లం కానీ వెయ్యకూడదు. ఇవి కలిపిన పాలల్లో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఎండు ఖర్జూరాలు కలిపిన పాలు రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఖర్జూరాలలో ఉండే ప్రోటీన్లు కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి వాటిని తగ్గిస్తాయి. ఖర్జూరాలలో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరాలను తినడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్లు, మూత్ర సంబంధ సమస్యలు వంటివి తగ్గుతాయి. ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తినడం వలన ఎండాకాలంలో దాహం తీరుతుంది.
ఎండు ఖర్జూరాలల్లో ఉండే కాల్షియం ఎముకలు దృడంగా ఉండేలా చేస్తాయి. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఎండు ఖర్జూరాలను రోజూ విడిగా తినవచ్చు లేదా నీళ్ళల్లో నానబెట్టిన ఖర్జూరాలు తినవచ్చు. ఇంకా పాలల్లో ఎండు ఖర్జూరాలను మరిగించుకొని తినవచ్చు. ఎండు ఖర్జూరాలను ఎదో ఒక విధంగా రోజూ తినడం వలన మన శరీరం బలంగా తయారవుతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు ఖర్జూరాలను రోజూ తినడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది.