Water Melon: పుచ్చకాయతో ఆస్తమాకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు!
పుచ్చకాయ తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని దీనిని డైట్ లో భాగం చేసుకోవడం వల్ల అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:03 PM, Mon - 3 February 25

వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పండు కలింగర. దీనినే పుచ్చకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎండలు బాగా మండిపోతున్నప్పుడు చల్ల చల్లని పుచ్చకాయను తింటే ఆ మజానే వేరు అని చెప్పాలి. ఎండల వల్ల వచ్చే ఎన్నో రకాల సమస్యల నుంచి పుచ్చకాయ బయటపడేస్తుంది. వేసవికాలంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు కొన్ని పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుందట. పుచ్చకాయ ఎన్నో లాభాలను కలిగించడంతోపాటు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారంగా కూడా పనిచేస్తుందట. మరి పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే..
పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎండాకాలంలో దీనిని తినడం వల్ల శరీరానికి అవసరమైనంత నీరు లభిస్తుంది. రోజూ తింటే డీహైడ్రేట్ కు గురికాకుండా ఉంటాం. కొంతమందికి గొంతు త్వరగా ఎండిపోతుంది. అలాంటి వారు పుచ్చకాయ తినడం వల్ల అలాంటి సమస్యలు ఎదురు కావు. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఎంత తిన్నప్పటికీ బరువు పెరగకుండా ఉంటారు. పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల అటు పోషకాలు మెండుగా అవడంతో పాటు ఇటు నీరు ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. పైగా శరీరం హైడ్రేట్ అవుతుందట. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ పుచ్చకాయను ఎర్రగా మారుస్తుంది. టమాట ఎర్రగా ఉండడానికి కూడా ఈ లైపోనీనే కారణం. ఈ లైపోనిన్ కు కొలెస్ట్రాల్ ను తగ్గించే సామర్ద్యం కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పుచ్చకాయ అదుపులో వుంచడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయట.
కాగా పుచ్చకాయలో 40 శాతం వరకు వైటమిన్ సి ఉంటుంది. ఉబ్బసాన్ని, ఆస్థమాను తగ్గించే శక్తి ఈ వైటమిన్ సి లో ఉంటుంది. ప్రతీరోజు పుచ్చకాయ తింటే ఆస్తమా, ఉబ్బసం తీవ్రత తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కాగా శరీరంలో పొటాషియం తక్కువగా ఉంటే తిమ్మర్లు ఎక్కువగా వస్తాయి. దాంతో నరాలు కూడా బలహీనంగా మారిపోతాయి. పుచ్చకాయలో ఈ పొటాషియం పోషకాలు మెండుగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్ తాగితే మీ శరీరంలో తిమ్మిర్లు రాకుండా చేస్తుందట. పుచ్చకాయలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుందట. కాబట్టి ప్రతీ రోజు కొంత పుచ్చకాయను ఖచ్ఛితంగా తినాలని, ఇది వడదెబ్బ వంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తుందని చెబుతున్నారు. పుచ్చకాయలో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ తో పోరాడి శరీరం బయటకు పంపించివేయబడుతంది. ఒక వేల టాక్సిన్స్ పరిగితే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో కిడ్నీలు కూడా దెబ్బతింటాయాట. కాబట్టి ప్రతీ రోజూ పుచ్చకాయ జ్యూస్ ని తాగడం మంచిదని చెబుతున్నారు.