Banana With Ghee: నెయ్యి అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
- Author : Sailaja Reddy
Date : 25-03-2024 - 2:20 IST
Published By : Hashtagu Telugu Desk
నెయ్యి,అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండింటిని కొంచెం పంచామృతంలో వినియోగిస్తూ ఉంటారు. చాలామంది ఈ రెండింటిని తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. రెండింటిలోనూ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అరటిపండులో విటమిన్ సి, బి-6, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
అరటిపండు తినడం వల్ల శరీరానికి తగినంత ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు అందుతాయి, శారీరక బలహీనతలను కూడా దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల వైరస్, ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. అరటిపండు, నెయ్యి కలిపి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. అరటిపండు, నెయ్యి తినడం వల్ల కడుపుకు మేలు జరుగుతుంది.
అరటిపండును నెయ్యితో కలిపి తింటే పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పీచుతో కూడిన అరటిపండు, నెయ్యి కలిపి తీసుకుంటే ఉదర వ్యాధులు నయమవుతాయి. గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది.అలాగే ఈ అరటిపండు, నెయ్యి తింటే బరువు పెరుగుతారు. స్లిమ్ బాడీని దృఢంగా, ఆకృతిలో ఉంచుకోవాలంటే అరటిపండు, నెయ్యి కలిపి తినండి. అరటిపండు, నెయ్యిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కండరాలకు బలం చేకూరుతుంది.
అరటిపండు, నెయ్యి మిక్స్ చేయడం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది. అరటిపండు, నెయ్యి తినడం వల్ల చర్మ కణాలు పునరుత్తేజితం అవుతాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజమైన గ్లో వస్తుంది. లైంగిక సమస్యలతో బాధపడే పురుషులకు అరటిపండు, నెయ్యి కలిపి తినడం వల్ల మేలు జరుగుతుంది. అరటిపండు, నెయ్యి తీసుకోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మేలు జరుగుతుంది. అరటిపండు నెయ్యి కలిపి తినడం వల్ల స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.