Ayurvedic Drinks: బాడీలోని వేడిని తగ్గించే ఆయుర్వేద డ్రింక్స్.. పడుకునే ముందు తాగితే..
ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. వేసవికాలంలో జీర్ణక్రియ సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో ఉండే కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపు సమస్యల సుంచి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- Author : Anshu
Date : 15-05-2023 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
Ayurvedic Drinks: ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. వేసవికాలంలో జీర్ణక్రియ సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో ఉండే కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపు సమస్యల సుంచి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వేసవికాంలో పేగు, ఉదర సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. మెటిమలు, అతిసారం, యూటీఐ, తలనొప్పి వటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని జ్యూస్ ల వల్ల వీటి నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద వైద్యుల చెబుతున్నారు.
అరటి గుజ్జు రసం శరీరంలో మంటతో బాధపడేవారికి చాలా మంచి చేస్తుందట. బయాబెటిస్ తో బాధపడేవారికి ఇది మరింత మంచిదట. ఇక గుల్కండ్ పాలు వేసవిలో పిత్త దోషం నుంచి కాపాడతుంది. రాత్రి పడుకునేముంుద ఒక గ్లాస్ తాగితే బాడీ కూల్ అవుతుంది. ఇక చెరువు రసం కూడా ఎండాకాలంలో బాడీని కూల్ చేస్తుంది. అలాగే ఇన్‌స్టంట్ ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ చియా సీడ్స్ ని నిమ్మరసంలో నానబెట్టి తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ అవుతుంది.
ఇక మజ్జిగ కూడా ఎండాకాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మజ్జిగ వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి చల్లగా అవుతుంది. భోజనంతో పాటు ఒక గ్లాసు మజ్జిగ రోజూ తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు కూడా ఎండాకాలంలో రోజూ తీసుకోవాలి. దీని వల్ల బాడీ కూల్ అవ్వడంతో పాటు అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే కొబ్బరిబోండంలో ఉండే కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.