Period Pain: పీరియడ్స్ సమయంలో వీటికి దూరంగా ఉండండి. లేదంటే కడుపునొప్పి సమస్య మరింత పెరుగుతుంది.
- Author : hashtagu
Date : 01-04-2023 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
పీరియడ్స్ (Period Pain)మహిళలకు ఒక సవాళులాంటింది. ప్రతినెలా పీరియడ్స్ సమస్యను ఎదుర్కొంటుంటారు. కొందరిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఆ ఐదు రోజులు చాలా కష్టంగా ఎదుర్కొంటారు. కడుపు నొప్పి, వికారం నుండి మలబద్ధకం వరకు సమస్యలు ఉంటాయి. పీరియడ్స్ కు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. చాలా మంది ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకుండా లోలోపల బాధపడుతుంటారు. ఈ నొప్పినుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు అనుసరించాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు ఈ సమస్యను మరింత పెంచుతాయి. పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి సమస్యను దూరం చేసే చిట్కాల గురించి తెలుసుకుందాం.
– పీరియడ్స్ క్రాంప్స్ తగ్గించుకోవడానికి చాలా మంది తరచుగా కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. ఇది తరచుగా తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం…ఈ సమయంలో తరచుగా టీ లేదా కాఫీ తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. హృదయ స్పందన రేటు కూడా పెరగవచ్చు. కాబట్టి పీరియడ్స్ సమయంలో టీ కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.
– పీరియడ్స్ సమయంలో వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. రక్తస్రావం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఆ పైన వేయించిన ఆహారం జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. ఈ సమయంలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియంతో కూడిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
– పీరియడ్స్ సమయంలో చర్మం మరింత సున్నితంగా మారుతుంది. ఈ సమయంలో వ్యాక్స్ చేయవద్దు. శరీరానికి ఇబ్బందిని కలిగించే పనులకు దూరంగా ఉండాలి.
– రోజంతా ప్యాడ్ ఉపయోగించడం మర్చిపోవద్దు. కనీసం ప్రతి 6 నుండి 8 గంటలకు ప్యాడ్‌లను మార్చండి. ప్యాడ్‌ని ఉపయోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకుతుంది.
– ఈ సమయంలో పాలు లేదా పాల ఉత్పత్తులు తినకపోవడమే మంచిది. పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉన్న మాట నిజమే కానీ పాలవల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి . దీని వల్ల కడుపు నొప్పి సమస్య మరింత పెరుగుతుంది. కొద్ది రోజులు పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది.
– అదేవిధంగా, దాదాపు ప్రతి ఒక్కరూ పీరియడ్స్ ప్రారంభమైన మొదటి రోజు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు . చాలా మంది వైద్యుల సలహాలు పాటించి మందులు వాడుతున్నారు. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు.