Sweet Cancer : “తియ్యటి” గండం..పట్టణాల్లో అతిగా కృత్రిమ స్వీటెనర్ల వినియోగం
Sweet Cancer : కృత్రిమ స్వీటెనర్లు ఉండే ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా ?అయితే తస్మాత్ జాగ్రత్త ..
- By Pasha Published Date - 02:01 PM, Sat - 15 July 23
Sweet Cancer : కృత్రిమ స్వీటెనర్లు ఉండే ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా ?
అయితే తస్మాత్ జాగ్రత్త ..
కనీసం ఇక నుంచి అయినా వాటి వినియోగాన్ని బాగా తగ్గించండి అని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్నింగ్ ఇచ్చింది.
కృత్రిమ స్వీటెనర్ల అతి వినియోగం క్యాన్సర్ కారకంగా మారొచ్చని తెలిపింది.
ఈనేపథ్యంలో లోకల్ సర్కిల్స్ (Local Circles) అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also read : SBI: ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు షాక్.. మరింత భారం కానున్న ఈఎంఐలు..!
కృత్రిమ స్వీటెనర్లు అనేవి మామూలు చక్కెర కంటే దాదాపు 600 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. ఇవి క్లోరినేటెడ్ చక్కెరలు. వాస్తవానికి మనం వాడే సాధారణ చక్కెర ను వివిధ విడతల్లో ప్రాసెస్ చేసి.. దానిలోని 3 హైడ్రాక్సిల్ అణువుల సమూహాన్ని 3 క్లోరిన్ అణువులతో భర్తీ చేస్తే “సుక్రలోజ్” అనే కృత్రిమ స్వీటెనర్ రెడీ అవుతుంది. ఇందులో క్యాలరీలు ఉండవు. కానీ తీపి గుణం 600 రెట్లు పెరుగుతుంది. ఈ “సుక్రలోజ్” నుంచే రకరకాల కృత్రిమ స్వీటెనర్లను తయారు చేస్తుంటారు. వీటిని తినే సోడా, కూల్ డ్రింక్స్, డ్రై డెజర్ట్‌లు, ఫ్రై చేసిన ఫుడ్స్, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్, షుగర్‌ఫ్రీ చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, ఎనర్జీ డ్రింక్స్ లలో ఉపయోగిస్తుంటారు.
Also read : Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్ 3పై అమర్చిన కెమెరా పంపిన ఫోటోలు చూశారా !
లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలిన విషయాలు
- కృత్రిమ స్వీటెనర్ల మితిమీరిన వినియోగంతో క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన నేపథ్యంలో లోకల్ సర్కిల్స్ (Local Circles) సంస్థ మన దేశంలో ఇటీవల ఒక సర్వే నిర్వహించింది.
- ఈ సర్వేలో భాగంగా మన దేశంలోని 295 జిల్లాల్లో 23,000 మంది అభిప్రాయాలను సేకరించామని లోకల్ సర్కిల్స్ పేర్కొంది.
- పట్టణాల్లో నివసించే భారతీయుల్లో 38 శాతం మంది ప్రతి నెలా కృత్రిమ స్వీటెనర్లతో కూడిన ఆహారాన్ని వినియోగిస్తున్నట్లు సర్వేలో తేలింది.
- ఫుడ్ బ్రాండ్స్ వాటి ప్యాక్ ముందు భాగంలో కృత్రిమ స్వీటెనర్ల మోతాదును ప్రస్తావించాలని సర్వేలో పాల్గొన్న 91 శాతం మంది కోరారు.
- కృత్రిమ స్వీటెనర్లను వినియోగించే ప్రతి ముగ్గురిలో ఒకరు డైట్ సోడా డ్రింక్స్, షుగర్ ఫ్రీ గమ్ల రూపంలో దాన్ని తీసుకుంటారని సర్వేలో తేలింది.
- 26% మంది కృత్రిమ స్వీటెనర్లను ఎనర్జీ డ్రింక్స్ రూపంలో తీసుకుంటున్నారని గుర్తించారు.
- సర్వేలో పాల్గొన్న వారిలో 18% మంది షుగర్‌ఫ్రీ చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల రూపంలో కృత్రిమ స్వీటెనర్లను తీసుకుంటున్నారని సర్వే నివేదిక తెలిపింది.
Also read : Razakar: తెలంగాణ పల్లెలపై జరిగిన దమనకాండ నేపథ్యంలో ‘రజాకర్’ మూవీ
ASPARTAME డేంజర్ బెల్స్
ఆస్పార్టమే (ASPARTAME) అనే స్వీటెనర్.. మన చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. ఇది తెలుపు రంగులో, వాసన లేని పొడి రూపంలో ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న స్వీటెనర్ ఇది. ఒక కిలోగ్రాము శరీర బరువుకు.. 50 మిల్లీగ్రాముల చొప్పున మాత్రమే రోజువారీగా ఆస్పార్టమే తీసుకోవాలని అంటారు. డైట్ కోక్, కోకా-కోలా అనేవి ఆస్పార్టమే ను కలిగి ఉన్న ప్రసిద్ధ శీతల పానీయాలు. “ఆస్పార్టమే అతి వినియోగం వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కానీ తగిన మోతాదులో తక్కువగా వాడటం సురక్షితమే” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కి చెందిన నిపుణుల రెండు బృందాలు శుక్రవారం రోజున(జులై 14న) ప్రకటించాయి.
Tags
Related News
Mutton Pulusu : మటన్ పులుసు.. ఇలా చేస్తే ముక్క వదలకుండా తింటారు..
మటన్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. మటన్ ఇగురు, గోంగూర మటన్, దోసకాయ మటన్.. రుచిగా చాలా వండుకోవచ్చు. అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రాగి సంకటి.. ఇలా దేనితో కలిపి తినేందుకైనా టేస్టీగా ఉంటుంది.