Lip Balms: వేసవిలో పొడిబారిన పెదవులు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో పెదవులు పొడిబారడం, పగిలి రక్తం రావడం వంటి సమస్యలు కనిపిస్తే అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:04 PM, Fri - 14 March 25

మామూలుగా వేసవికాలం ఎంత నీరు తాగిన ఎన్ని పానీయాలు తాగినా పెదవులు పదే పదే పొడి బారడం కొన్ని కొన్ని సార్లు పెదవుల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పెదవులు విపరీతంగా పొడి పారిపోయి పెదవులు చీలుతూ ఉంటాయి. అందుకే వేసవికాలంలో విల్లంతవరకు ఎక్కువ నీటిని ద్రవపదార్థాలను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. వేసవిలో పెదవులు పొడి బారిపోయి, పగిలిన పెదాలతో తెగ ఇబ్బంది పడుతుంటారు. వేసవి ప్రభావం సున్నితమైన పెదవులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో పెదవులను కాపాడుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించటం మంచిదని చెబుతున్నారు. ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తేనెతో లిప్ బామ్.. వేసవి కాలంలో పెదవులు పొడి బారకుండా ఉండటం కోసం తేనె బాగా సహాయపడుతుంది. పెదవులపై తేనెను రాయటం ద్వారా పెదవులను ఎక్కువసేపు తాజాగా ఉంచుకోవచ్చట. ఇది పెదవులకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం గ్లిజరిన్,వాసెలిన్ లో కొన్ని చుక్కల తేనెను జోడించి, పొడిబారిన, పగిలిన పెదాలకు రాయాలట. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనె,2 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో తేనె మిక్స్ చేసి లిప్ బామ్ ను తయారు చేసుకొని అప్లై చేస్తూ ఉండటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట.
కొబ్బరి ఔషధ తైలం.. ఇంట్లోనే కొబ్బరిని ఉపయోగించి వేసవి లిప్ బామ్ ను తయారు వేసుకోవచ్చట. ఇది పెదాలను హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుందట. అలాగే మాయిశ్చరైజర్ గా కూడా ఇది పనిచేస్తుందట. పెదాలను మృదువుగా, ఉంచటంలో ఈ కొబ్బరితో తయారు చేసిన లిప్ బామ్ సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే దీనికోసం పెట్రోలియం జెల్లీతో సమాన పరిమాణంలో కొబ్బరి నూనె కలపుకోవాలి. గాలి చొరబడని కంటైనర్ లో పోసి సుమారు 30 నిమిషాల పాటు ఫ్రీజ్ లో పెట్టుకోవాలట. మీకు ఇష్టమైన నూనెను రెండు మూడు చుక్కులు దానిలో కలుపుకొని పెదవులకు రాసుకోవాలని చెబుతున్నారు.