Mobile Phone in Toilet: మొబైల్ ఫోన్ వాడుతూ టాయిలెట్‌కు వెళ్తున్నారా.. బాబోయ్.. మీరు డేంజర్‌లో ఉన్నట్లే..!
బాత్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలోనూ కొందరు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నారు.. అయితే, ఇలా చేయడం వల్ల అనేక ప్రమాదాలను కొనితెచ్చుకోవటమే అవుతుంది.
- Author : News Desk
Date : 26-03-2025 - 6:50 IST
Published By : Hashtagu Telugu Desk
Mobile Phone in Toilet: మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఓ భాగమైంది. తెల్లవారుజామున నిద్ర లేచిన సమయం నుంచి రాత్రి పడుకొనే వరకు మొబైల్ ఫోన్ జేబులో లేదా చేతిలో ఉండాల్సిందే. భోజనం చేసే సమయంలోనేకాక.. బాత్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలోనూ కొందరు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నారు.. అయితే, ఇలా చేయడం వల్ల అనేక ప్రమాదాలను కొనితెచ్చుకోవటమే అవుతుంది.
Read Also: Nithyananda : బొలీవియాలోని 4.80 లక్షల ఎకరాల్లో నిత్యానంద కలకలం
మనలో చాలామందికి, ముఖ్యంగా యువతీయువకులకు టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. అయితే, అరగంట కంటే ఎక్కువసేపు బాత్‌రూమ్‌లో గడిపేవారు వ్యాధుల భారినపడే అవకాశం ఎక్కువ. మొబైల్ ఫోన్‌తో బాత్‌రూమ్‌కు వెళ్లడం వల్ల మన దృష్టంతా మొబైల్ ఫోన్‌పైనే ఉంటుంది. ఫలితంగా ఇది శరీరంపై హానికరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. మెడను వంచుతూ మొబైల్ స్క్రీన్ వైపు చూడటం వల్ల మన మెడ, వెన్నెముకలో రకరకాల సమస్యలు వస్తాయి.
Read Also: Import Duty: మొబైల్, ఈ-వాహన వినియోగదారులకు శుభవార్త.. ధరలు భారీగా తగ్గే ఛాన్స్?
మలవిసర్జన సమయంలో ఫోన్ చూసేవారు ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుండిపోతారు. తద్వారా మలద్వారానికి పైన ఉండే భాగం యానస్ దగ్గర కండరాలపై ఒత్తిడికి కారణమవుతుంది. అంతేకాదు.. మలబద్దకం సమస్యతోపాటు మలం గట్టిగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఒత్తిడి మలద్వారం వద్దనున్న రక్తనాళాలపై ఒత్తిడికి కారణమవుతుంది. దీంతో అవి ఉబ్బిపోయి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కమోడ్ రకం టాయిలెట్‌నే వాడుతున్నారు. ఈ రకం టాయిలెట్ సహజంగానే యూనస్ చుట్టూ ఉన్న ప్రాంతం. అక్కడి కండరాలపై ఒత్తిడికి కారణమవుతుంది. ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఆ ఒత్తిడి మరింత పెరిగి మలవిసర్జన ఆలస్యం కావటంతోపాటు.. విసర్జన సమయంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎక్కువ మంది మరింత బలవంతంగా విసర్జన చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో సమస్యల్లో చిక్కుంటారు. అందువల్ల వీలైనంత తక్కువ సమయంలో మలవిసర్జన చేసేందుకు ప్రయత్నంచేయడం, టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించకపోవటం మంచిది.