HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Eating Dinner At Late Night

Late Night Dinner: రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేస్తున్నారా?

బిజీ లైఫ్‌ స్టైల్‌, లేట్‌ నైట్‌ జాబ్స్‌ కారణంగా చాలా మంది రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తూ ఉంటారు.

  • Author : Maheswara Rao Nadella Date : 01-12-2022 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nyt Dinner
Nyt Dinner

బిజీ లైఫ్‌ స్టైల్‌, లేట్‌ నైట్‌ జాబ్స్‌ కారణంగా చాలా మంది రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తూ ఉంటారు. పార్టీలు, ఫంక్షన్లంటూ కూడా ఆలస్యంగా ఆహారం తింటూ ఉంటారు. కొంతమందికైతే రాత్రి పూట ఆలస్యంగా తినడం అలవాటుగా మారిపోతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల కొందరు రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

డిన్నర్‌ లేట్‌ గా చేస్తే త్వరగా జీర్ణం కాదు. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మీకూ ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి 9:00 గంటల తర్వాత డిన్నర్‌ చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందని NCBI చేసిన పరిశోధనలో వెల్లడైంది. నిద్రకు, భోజనానికి మధ్యలో కనీసం రెండు గంటల గ్యాప్‌‌ ఉండడం చాలా ముఖ్యం. భోజనం తిన్న వెంటనే నిద్రపోతే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో డిన్నర్‌ పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, రక్తంలో చక్కెర పెరగడం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి అనేక అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

జీర్ణక్రియ సమస్యలు వస్తాయ్:

ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం 5 పద్దతులు..! ప్రతి ఒక్కరు కచ్చితంగా  తెలుసుకోవాల్సిన విషయాలు.. | 5 methods for a healthy digestive system are  things that everyone should know ...

రాత్రిపూట మన ఆహార అలవాట్లు జీర్ణక్రియపై ఎఫెక్ట్‌ చూపుతుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే డైరెక్ట్‌గా వెళ్లి పడుకుంటాం. భోజనం చేసిన తర్వాత ఎలాంటి యాక్టివిటీ ఉండదు. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్‌, ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

బరువు పెరుగుతారు:

10 Simple Rules To Gain Weight

రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉంటే కేలరీలు సరిగ్గా బర్న్ కావు, శరీరంలో ఫ్యాట్‌ పెరగడం ప్రారంభమవుతుంది. భోజనానికి, నిద్రపోవడానికి మధ్య రెండు గంటల గ్యాప్‌ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

బీపీ పెరుగుతుంది:

లోబీపీ ఉందా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి….! | Manalokam

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అధిక బీపీ, డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రి డిన్నర్‌ ఆలస్యంగా తింటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో కొవ్వును పెంచుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం మరింతగా పెరుగుతుంది.

నిద్రలేమి సమస్య:

నిద్రలేమి సమస్య.. కోవిడ్‌తో పాటు అది కూడా కారణమే!

రాత్రిపూట ఆలస్యంగా తింటే నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రిపూట నిద్రసరిగ్గా రావడం లేదని చాలా మంది కంప్లైంట్‌ చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట ఆలస్యంగా తినడం. డిన్నర్‌ లేట్‌గా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు ఇది నిద్రలేమికి దారి తీస్తుంది.

జ్ఞాపకశక్తి తగ్గుతుంది:

Vaartha Online Edition

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే మెదడుపై ప్రభావం పడుతుంది. కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో నిద్ర వేళలో ఆహారం తిన్న ఎలుకల జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

ఈ సమస్యలకు దారి తీస్తుంది:

stress - Workers in India facing severe stress, finds out Microsoft survey  - Telegraph India

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక శక్తి స్థాయి తక్కువగా ఉంటుంది. మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. మీ స్టామినా తగ్గే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • dinner
  • health
  • Late Dinner
  • Late Night
  • Night Dinner
  • side effects

Related News

Amazing health benefits of drinking milk with ghee at night..!

రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!

అద్భుతమైన రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నెయ్యిని ‘ద్రవ బంగారం’ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో నెయ్యికి విశిష్ట స్థానం ఉంది. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ, కెతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి.

  • Cancer Threat

    మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • What are the health benefits of eating walnuts?

    వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • Hips Cancer

    కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • There are many benefits of eating lettuce every day..!

    పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

Latest News

  • ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్‌పై వేటు!

  • జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd