Mung Beans: వేసవికాలంలో శరీరం చల్లగా ఉండడంతో పాటు బీపీ ,షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే వీటిని తినాల్సిందే!
ఎండాకాలంలో వేడి తగ్గి శరీరం చల్లగా ఉండాలి అన్నా, బీపీ షుగర్ వంటివి కంట్రోల్ లో ఉండాలి అన్న తప్పకుండా ఇప్పుడు చెప్పబోయేవి తినాల్సిందే అంటున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Mon - 7 April 25

వేసవికాలం వచ్చింది అంటే వాతావరణం లో వేడితో పాటు అనుకోకుండా శరీరంలో వేడి కూడా పెరుగుతూ ఉంటుంది. దీని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే శరీరం చల్లగా ఉంచుకోవడం కోసం చాలా రకాల వస్తువులు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే వేసవి కాలంలో తీసుకుంటే శరీరం చల్లగా ఉండడం మాత్రమే కాకుండా బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా కంట్రోల్ లో ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ పదార్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉడికించి తింటే మరికొన్ని అద్బుత లాభాలు కలుగుతాయి.
పెసలని ప్లాంట్ బేస్డ్ ప్రోటీని చెప్పవచ్చు. ఇందులో ఎన్నో అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిలోని ప్రోటీన్స్, విటమిన్స్ ఎ, సిలు, బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయట. అంతేకాకుండా ఇందులో ఐరన్, వీటితో పాటు జింక్ కూడా ఉంటుందట. హైపీబి ఉన్నవారికి పెసలు చాలా మేలు చేస్తాయి.. తరచుగా పెసలని ఏదో రకంగా తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుందట. ఇందులోని విటమిన్స్ హార్మోన్స్ ని ప్రేరేపిస్తాయట. ఎదిగే పిల్లలకి ఇది మంచి ఆహారం అని చెబుతున్నారు. అయితే ఇవి కేవలం ఆరోగ్యానికే మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా బాగా పనిచేస్తాయట.
పెసల్ని తరచుగా తింటే యవ్వనంగా కనిపిస్తారట. ఇందులోని కాపర్ చర్మం పై ముడతల్ని తగ్గిస్తుందట. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ ని నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయట. అదే విధంగా కొల్లాజెన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తాయని చెబుతున్నారు. కాగా పెసలలో ఎక్కువగా ఐరన్ ఉంటుందట. వీటిని తినడం వల్ల రక్తం పెరిగి రక్త సరఫరా సరిగా ఉంటుందట. అంతేకాకుండా ఇందులోని ఐరన్ శరీరంలోని అవయవాలకి ఆక్సీజన్ ని సమృద్ధిగా అందిస్తుందట. కాబట్టి, తరచుగా పెసలని డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. పెసలలో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందట. దీనిని తీసుకోవడం వల్ల బాడీ ఇన్సులిన్ ని తగ్గిస్తుందట. అదే విధంగా బ్లడ్ గ్లూకోజ్, ఫ్యాట్ లెవల్స్ ని కూడా తగ్గిస్తుందట. ఈ కారణం వల్లే బరువు కూడా ఈజీగా తగ్గవచ్చు. షుగర్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా పెసలని వారి డైట్‌లో యాడ్ చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే పెసలని తరచుగా తీసుకోవడం వల్ల బాడీలో వేడి తగ్గి శరీరం చల్లగా ఉంటుందని చెబుతున్నారు.