Dal-Rice: అన్నం పప్పే కదా అని తక్కువగా చూస్తున్నారా.. దీని వల్ల కలిగే లాభాలు ఎన్నో?
పప్పు అన్నం తినడానికి ఇష్టపడని వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:00 PM, Fri - 9 August 24

భారతదేశంలో చాలామంది ఇష్టంగా తినే ఆహార పదార్థాలలో అన్నం పప్పు ముందు వరసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్లీ మళ్లీ తినాలనిపించే వంటకం పప్పు అన్నం. ఈ రెండింటి కాంబినేషన్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. కానీ చాలామంది అన్నం పప్పు కాంబినేషన్ను పదే పదే తినడానికి అంతగా ఇష్టపడరు. ఎప్పుడు తినే అన్నం పప్పే కదా దాంట్లో కొత్తగా ఏముంది అని కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు వైద్యులు. మరి అన్నం పప్పు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాత్రిపూట అన్నం, పప్పు తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే ఇది చాలా సులువుగా జీర్ణం అవుతుంది. దీనిలో ఉండే పోషకాలను కూడా పొందవచ్చు. రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరాన్ని తింటే అజీర్థి వంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవని చెబుతున్నారు.
పప్పు చారును అన్నంలో కలుపుకుని తింటే రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుందని చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల మీరు నిద్రకోసం కష్టపడాల్సిన అవసరం లేదట. ఇది మీరు చాలా త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంట. దీంతో మీరు పొద్దున్నే ఎనర్జిటిక్ గా మేల్కొంటారు. రోజంతా రీఫ్రెష్ గా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అన్నం, పప్పు తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు.
వీటివల్ల మీరు బరువు పెరిగే అవకాశం అసలే ఉండదని చెబుతున్నారు. అలాగే బరువు కూడా సులువుగా తగ్గుతారట. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అనే చెప్పాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ తేలికపాటి భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. పప్పు అన్నాన్ని కలిపి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఈ తేలికపాటి భోజనంలో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను, ఎముకలను బలోపేతం చేస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అన్నం, పప్పును కలుపుకుని తింటే కండరాలు బలోపేతం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పప్పు అన్నం తింటే దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. దంతాల సమస్యలు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందట. కాబట్టి పప్పు అన్నమే కదా అని చాలా తక్కువగా చూడకుండా ఆ పప్పన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు.