Ghee: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలోని కలుపుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
- By Anshu Published Date - 05:00 PM, Thu - 12 September 24

నెయ్యి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నెయ్యిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. అందుకే వైద్యులు కూడా తరచుగా నెయ్యిని తీసుకోమని చెబుతూ ఉంటారు. మనం నెయ్యిని అనేక రకాల స్వీట్లు రూపంలో ఆహార పదార్థాల రూపంలో తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా గోరువెచ్చని నీటిలో ఉదయాన్నే నెయ్యి కలుపుకుని తాగారా. ఇలా తాగితే ఏం జరుగుతుందో ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా మాములుగా చలికాలంలోని చల్లని గాలులు వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.
కానీ ఇతర సీజన్ లతో పోలిస్తే ఈ కాలంలోనే దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్ లో మన ఆరోగ్యం బాగుండాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో నెయ్యి మనల్ని వెచ్చగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఇలాంటి ఆహారాల్లో నెయ్యి కూడా ఒకటి. దీనిని వింటర్ సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. నెయ్యిలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
అందుకే దీనిని ఎన్నో రకాలుగా తమ ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అయితే గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మన జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏ పనీ చేయలేరు. కూర్చోవడానికి, నడవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది.
ఇలాంటప్పుడు నెయ్యిలో ఉండే ఔషద గుణాలు ఈ కీళ్ల నొప్పులను తగ్గించి దృఢంగా మారుస్తాయి. ఈ చలికాలంలో చల్లని గాలులు వల్ల మన చర్మంలో తేమ తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. ఇలాంటప్పుడు ప్రతిరోజూ వేడి నీటితో నెయ్యిని తాగడం వల్ల చర్మానికి అవసరమైన పోషణ అందుతుంది. ముఖ్యంగా నెయ్యిలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చర్మం సహజ మెరుపు పెరుగుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. మీరు ఎప్పుడూ జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే వేడినీటిలో నెయ్యి కలిపి తాగాలి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
అవును దీన్ని రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ల స్రావం పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వు కు మంచి వనరు. నెయ్యి మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అలాగే అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఫుడ్ కోరికలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు. వేడి నీరు మన శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఈ వేడినీటిలో నెయ్యిని కలిపి తాగడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. నిజానికి నెయ్యిలో నిర్విషీకరణ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని చెబుతున్నారు.