Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?
Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె,నిమ్మరసం కలుపుకొని తాగే వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 05-12-2025 - 6:31 IST
Published By : Hashtagu Telugu Desk
Health Tips: చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని తాగే అలవాటు ఉంటుంది. కొందరు మామూలు నీరు తాగుతూ ఉంటారు. ఇంకొందరికి గోరు వెచ్చని నీటిలో తేనె, కాస్తింత నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. అయితే దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని అంటుంటారు. కాగా చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో తేనె, కాస్తింత నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు ఉంటుంది.
దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట. నిజానికి, వేడి లేదా గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనదని, దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని, ఒకవేళ మీరూ దీన్ని చేస్తుంటే జాగ్రత్తగా ఉండటం మంచిదని చెబుతున్నారు. వేడి పదార్థాలతో తేనె కలిపి తాగడం అస్సలు మంచిది కాదట. దీనిని సేవించడం అస్సలు ఆరోగ్యకరం కాదని, ఇది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.
కాగా తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదట. తేనెను వేడి నీటిలో కలిపినప్పుడు అది మీ శరీరానికి విషపూరితంగా మారుతుందని, ముఖ్యంగా 140 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తేనె విషపూరితంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనే కలుపుకుని తాగే వారు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.