Mango: మామిడి పండ్లు తింటే నిజంగానే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
మామిడిపండు తింటే బరువు పెరుగుతారా లేదా బరువు తగ్గుతారా, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:00 PM, Mon - 24 March 25

మామిడి పండ్లు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి మనకు కేవలం వేసవి కాలంలో మాత్రమే లభిస్తాయి అన్న విషయం తెలిసిందే. అయితే వేసవికాలంలో చాలామంది మామిడి పండ్లను తెగ తినేస్తూ ఉంటారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మరి మామిడి పండు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలు పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా ఈ విషయం వైద్యులు ఏమంటున్నారంటే..
మామిడి పండ్లు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడతాయట. మామిడిలో సహజంగా జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయట. మామిడిలో ప్రోటీన్ విచ్ఛిన్నం, జీర్ణక్రియకు సాయపడే ఎంజైములు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయట. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే మామిడి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి డైటరీ ఫైబర్ సహాయపడుతుందట. పండిన మామిడి కంటే ఆకుపచ్చ మామిడిలో పెక్టిన్ ఫైబర్ ఎక్కువగా లభిస్తుందట. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వ్యక్తులు మామిడి పండ్లను తింటే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
అలాగే మామిడి పండు కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పాలి. అందుకే మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పండుని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. మామిడి పండులో కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, విటమిన్స్ ఉంటాయట. మామిడి పండ్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుందట. ఇది విటమిన్ ఎ ఉత్పత్తికి సహాయపడుతుందట. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కంటి దృష్టిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ పండులోని విటమిన్ ఏ, కెరోటిన్ దృష్టి నష్టాన్ని నివారిస్తుందట.
మామిడి పండు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందట. మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తాయట. మామిడి పండు తినడం వల్ల చర్మ మృత రంధ్రాలు ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, తొలగించడానికి కూడా సహాయపడుతుందట. మామిడి మితంగా తింటే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట. మామిడి పండు తొక్కలో ఉన్న ఫైటోకెమికల్స్ సహజ కొవ్వు బస్టర్లుగా పనిచేస్తాయట. మామిడి గుజ్జు ఫైబర్లతో నిండి ఉంటుంది. ఫైబర్స్ సంతృప్తి భావనను ప్రేరేపిస్తాయట. అధిక ఫైబర్ పండ్లు లేదా కూరగాయలను తినడం ద్వారా మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని దాంతో తక్కువ మొత్తంలో తింటారు. అప్పుడు ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. అయితే మోతాదుకి మించి మామిడి పండ్లు తింటే మాత్రం బరువు పెరగడం ఖాయం అంటున్నారు.