Lord Shiva: ఐశ్వర్యం మీ సొంతం అవ్వాలంటే శివుడికి ఈ విధంగా అన్నం సమర్పించాల్సిందే!
పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధించాలంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాలట..
- By Anshu Published Date - 01:45 PM, Thu - 19 September 24

మామూలుగా సోమవారం రోజు పరమేశ్వరున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే శివుడికి ఇష్టమైన పువ్వులను నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి అన్న, అష్టైశ్వర్యాలు సిరిసంపదలు కలగాలి అంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు. అందుకోసం ముఖ్యంగా అన్నాన్ని వివిధ రూపాలుగా సమర్పించడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
తెల్ల అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నదిలో వదిలితే, ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అలాగే చర్మ వ్యాధులు ఉన్నవారు తెల్ల అన్నంలో తేనె కలిపి నైవేద్యంగా పెట్టడం వల్ల చర్మానికి సంబంధించిన వ్యాధులు సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు. ఇక రోగ నివారణ కావాలి అనుకున్న వారు తెల్ల అన్నం, తేనె, పంచదార, కొబ్బరి కలిపి కులదేవతకు నైవేద్యం పెట్టి అన్నదానం చేస్తే, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే తెల్ల అన్నం, శనగపప్పుతో పాయసం చేసి ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి దానం చేస్తే, ఇంట్లో శాంతి, ప్రేమ, అభిమానం పెరుగుతాయట.
పితృదేవతల పాపాలు తొలగిపోవాలి అంటే తెల్ల అన్నం నల్ల నువ్వులు కలిపి శనీశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు వేస్తే పితృదేవతల శాపాలు కూడా తొలగిపోతాయట. అన్నం దేవునికి నైవేద్యం పెట్టి, పశువులకు ఆహారంగా ఇచ్చి, అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే, ధనం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. దిష్టి ఉన్నవారు తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దారులు కలిసే చోట పెట్టడం వల్ల దిష్టి తొలగిపోతుందట.