Spiritual: ఏంటి.. గోర్లు వెంట్రుకలు ఈ రోజు కత్తిరిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందా?
వారంలో కొన్ని రోజుల్లో గోర్లు కత్తిరించుకోవడం వెంట్రుకలు కట్టించుకోవడం లాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:34 PM, Tue - 21 January 25

వారంలో కొన్ని రోజుల్లో గోర్లు కత్తి నుంచి కోవడం జుట్టు కత్తిరించుకోవడం నిషేధించబడింది. ప్రత్యేకించి కొన్ని రోజుల్లో ఈ హెయిర్, నైల్స్ కట్ చేసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చును చెబుతున్నారు. అయితే గోర్లు కత్తిరించుకోవడానికి, వెంట్రుకలు కట్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక సమయం ఉంటుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరిస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదట. ఇంతకీ గోర్లు అలాగే జుట్టు వారంలో ఏ రోజుల్లో కట్ చేసుకోవాలి? ఇలా కట్ చేసుకుంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..
ఆదివారం రోజు గోళ్లు కత్తిరించుకోకూడదట. ఒక వేల కత్తిరిస్తే ధననష్టం, ఆయుష్షు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఆదివారం సూర్య దేవుడికి చాలా ఇష్టమైన రోజు, కాబట్టి ఆ రోజు మాంసం తినకూడదట. తలకు కూడా నూనె అప్లై చేసుకోకూడదని చెబుతున్నారు. ఇక సోమవారం గోళ్లు కత్తిరిస్తే శుభవార్తను వింటారట. వారు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుందట. మంగళవారం గోళ్లు కత్తిరిస్తే నష్టాలు, చిక్కులు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు. బుధవారం గోళ్లు కత్తిరిస్తే ఆరోగ్య లాభం, మనశ్శాంతి లభిస్తుందని చెబుతున్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా తగ్గుముఖం పడతాయట. గురువారం గోళ్లు కత్తిరిస్తే ధనలాభం, వంశాభివృద్ధి జరుగుతుందట. ఆకస్మికంగా ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి వస్తుందని చెబుతున్నారు. ఇక శుక్రవారం రోజు గోళ్లు కత్తిరిస్తే అరిష్టం కలుగుతుందట. దీర్ఘకాలిక వ్యాధులు సంక్రిమస్తాయట, లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని చెబుతున్నారు.
ఆ రోజు కత్తిరిస్తే ఇంట్లో వున్నవారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు గోళ్లు కత్తిరించవద్దు. శనివారం రోజు గోళ్లు కత్తిరిస్తే శనీదోషం తొలగిపోతుంది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఈ మూడు రోజులూ ఎట్టి పరిస్థితిలో గోళ్లు కత్తిరించవద్దు అని చెబుతున్నారు పండితులు. పొద్దున 12 గంటల లోపు మాత్రమే గోళ్లను కత్తిరించాలట. గోళ్లను నోట్లో పెట్టి కొరకడం దరిద్రమని పండితులు చెబుతున్నారు. గోళ్లను కత్తిరించిన తరువాత వాటిని తొక్కవద్దు. అలా తొక్కితే శరీరంలో వున్న తేజస్సు శక్తి క్షీణించిపోతుందట. గోళ్లను కట్ చేసిన తరువాత ఇంటి ఆవరణలో వాటిని పడేయకూడదట. అలా కట్ చేసిన గోర్లను ఒక చిన్న పేపర్ లో పెట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలని చెబుతున్నారు. అమావాస్య రోజు అలాగే పూర్ణిమా ఏకాదశి పండుగ రోజుల్లో రాత్రి వేళల్లో పొరపాటున కూడా గోర్లు కత్తిరించకూడదట. అలాగే ఆదివారం మంగళవారం శుక్రవారం రోజు కటింగ్ షేవింగ్ వంటివి చేయించుకోకూడదని చెబుతున్నారు. పండగల రోజుల్లో షేవింగ్, కటింగ్ ఎట్టిపరిస్థితుల్లో చేయించుకోవద్దు. ఒకవేళ చేయించుకుంటే ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుందట. బుధవారం, గురువారం, శనివారం రోజుల్లో మాత్రమే కటింగ్, షేవింగ్ చేయించుకోవాలట.