HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Why Is Dwajasthambam In Front Of The Temple

Dwajasthambam: ధ్వజస్తంభం.. ఆలయాల ముందు ఎందుకు పెడతారో తెలుసా..?

ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం.

  • Author : Gopi Date : 24-10-2022 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (5)
Cropped (5)

దేవాలయానికి కొంత దూరం నుంచే కన్పించేది ధ్వజస్తంభం. ఇక ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ, చిరుగంటల సవ్వడితో, తల ఎత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం (జెండా). ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఆలయపురుషునిలో ఉన్న షట్చక్రాలలో మొదటిదైన మూలాధారచక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కనుకనే ఇది ఆలయానికి మూలస్తంభంగా పేర్కొంటారు.

ప్రాచీన యాగశాలలే కాలాంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో యూపస్తంభం ధ్వజస్తంభంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు త్రిమూర్తుల సమిష్టితత్త్వం దర్శనమిస్తుంది. అలాగే ధ్వజస్తంభం పైభాగాన మూడు పలకలు, మూడు శిఖరాలు ఉంటాయి. దక్షిణ భారతమంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే ధ్వజస్తంభం ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించబడుతుంది.

ఈ ధ్వజస్తంభం ఎత్తు ఎంత ఉండాలనేది నాలుగు రకాలుగా చెప్పబడింది. గోపురమంత ఎత్తు, ఆలయవిమానమంత ఎత్తు, శిఖరమంత ఎత్తు, ఆలయ పైకప్పు సమానంగా ఉండవచ్చు. ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కొయ్యతో నిర్మిస్తారు. పూర్వం నాలుగుదిక్కులా నాలుగు ధ్వజస్తంభాలుండేవని శాసనాలు చెబుతున్నాయి. దేవాలయ ఆగమం ప్రకారం దేవాలయానికి వెళ్లలేనివారు ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన దేవాలయంలోకి వెళ్లిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణలు చేసేటప్పుడు నిలబడి అత్యంత శ్రద్ధతో మనస్సును భగవంతునితో లగ్నం చేసి కోరిన కోర్కిలు తప్పక ఫలిస్తాయని నమ్మకం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • Dwajasthambam
  • temples

Related News

Rudraksha

Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

హిందూ విశ్వాసం ప్రకారం, రుద్రాక్ష పరమ శివుడి కన్నీటి నుండి ఉద్భవించింది. అందుకే ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివుని అనుగ్రహం పొందడానికి ప్రజలు తరచుగా రుద్రాక్షలు ధరించడం కనిపిస్తుంది. రుద్రాక్ష దేవతలకు, నవగ్రహాలకు సంబంధించినది. దీనితో పాటు రుద్రాక్షను ధరించే ముందు తప్పనిసరిగా పూజించాలని చెబుతారు. రుద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయి. కావున మీ రాశిని బట్టి రు

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd