HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Why Do Sabarimala Devotees Wear Black Clothes

Ayyappa Devotees: అయ్యప్ప స్వాములు నలుపు రంగు దుస్తులను ఎందుకు వేసుకుంటారో తెలుసా..?

సాధారణంగా కార్తీకమాసం మొదలు కాగానే ఎంతోమంది భక్తులు వారి ఇష్టదైవమైన స్వామివారి మాల ధరించి స్వామివారి సేవలో నిమగ్నమవుతారు.

  • Author : Gopi Date : 22-11-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sabarimala Prasadam
Sabarimala Prasadam

సాధారణంగా కార్తీకమాసం మొదలు కాగానే ఎంతోమంది భక్తులు వారి ఇష్టదైవమైన స్వామివారి మాల ధరించి స్వామివారి సేవలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో ఎంతో మంది అయ్యప్ప మాలలు, శివమాలలు ధరిస్తూ ఉంటారు. ఇక కార్తీకమాసంలో ఎక్కువగా మనకు అయ్యప్పస్వామి భక్తులు కనబడుతూ వుంటారు.అయ్యప్ప మాలను ఎంతో నియమ నిష్టలతో ధరించాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు కఠిన నియమాలను పాటిస్తూ నిత్యం స్వామివారి సేవలో ఉంటారు.

శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించే యాత్రికులలో ఎక్కువ మంది నల్ల దుస్తులు ధరిస్తారు. నల్ల ధోతీ, ప్యాంటు, చొక్కా లేదా టీ-షర్టు. ఇకపోతే.. అయ్యప్ప మాల ధరించిన వారు నలుపు రంగు దుస్తులను ఎందుకు ధరిస్తారు అనే విషయం గురించి చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి అయ్యప్ప మాల ధరించిన వారు నలుపు రంగు దుస్తులను ధరించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే అయ్యప్ప మాల చలికాలంలో వేయడం వల్ల నలుపురంగు శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందుకోసమే ఈ చలి తీవ్రత నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం అయ్యప్ప మాల ధరించే వారు నలుపు దుస్తులను ధరిస్తారు. ఇక స్వామివారి దర్శనం కోసం అడవుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనుక క్రూర జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నలుపు రంగు దుస్తులను ధరిస్తున్నారు.

అయ్యప్ప మాల ధరించిన స్వాములు 41 రోజుల పాటు దీక్ష పాటిస్తూ 18 కొండలపై 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం మాల నుంచి విముక్తి పొందుతారు. ఇలా అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చే భక్తులు 41 రోజులు దీక్షతో ఇరుముడి కట్టుకొని స్వామివారికి చెల్లిస్తారు. కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు మాల ధరించి సంక్రాంతి వరకు నియమ నిష్టలతో ఉండి మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayyappa
  • Ayyappa Devotees
  • Black clothes
  • kerala
  • sabarimala
  • Sabarimala Ayyappa temple
  • Shabarimala Ayyappa

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

    • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

    • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

    • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

    • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd